Cpi threatens govt to start state wide agitation

communist party of india, leftists, electricity charges hike, protest against electricity charges, protest against ap govt

cpi threatens govt to start state wide agitation

leftists.png

Posted: 03/27/2013 03:30 PM IST
Cpi threatens govt to start state wide agitation

cpi

విద్యుత్ ఛార్జీల పెంపుకి నిరసనగా వామపక్షాలు చేపట్టిన దీక్షలను భగ్నం చేస్తూ నాయకుల అరెస్ట్ లకు పూనుకున్న ప్రభుత్వం మీద మరోసారి తీవ్రస్తాయిలో నిరసనలు తెలుపుతూ ఈ రోజు హైద్రాబాద్ ఆర్ టి సి క్రాస్ రోడ్ దగ్గర రాస్తా రోకో నిర్వహించారు.  

ప్రభుత్వం వెంటనే పెంచిన ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు.  వామ పక్షాల ఆందోళనకు ఎప్పుడూ రద్దీగా ఉండే ఆర్ టి సి క్రాస్ రోడ్ లో కాసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది.  విద్యుత్ ఛార్జీలను తగ్గించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కి పిలుపునివ్వాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  ఇదే తరహాలో జిల్లాలలో కూడా నిరసనలు తెలియజేసారు.

సిపిఐ నేతలు గుండా మల్లేష్, అజీజ్ భాషా పాల్గొన్న ఈ ఆందోళనలో భాగంగా వామపక్ష నేతలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టి బొమ్మలను దహనం చేసారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bsp leader bhardwaj murder clues
Way laid bandits tried loot shirdi tourists  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles