Bsp leader bhardwaj murder clues

bsp party, deepak bhardwaj, murder at farm house, task force, haryana police, delhi police, recovery of scoda car

bsp leader bhardwaj murder clues

bhardwaj-murder.png

Posted: 03/27/2013 12:38 PM IST
Bsp leader bhardwaj murder clues

cc-footageనిన్న ఉదయం ఫామ్ హౌస్ లో బహుజన్ సమాజ్ వాది పార్టీ నాయకుడు దీపక్ భరద్వాజ్ హత్యలో పోలీసులకు దొరికిన ఆధారాలతో కేసు చిక్కు ముడి వీడుతోంది.  స్కోడా కారులో వచ్చిన హంతకులు ఫామ్ హౌస్ లోకి రావటం, తిరిగి పోవటం దృశ్యాలు ఫామ్ హౌస్ లోని సిసి కెమేరాల్లో చిక్కాయి.  సిసి కెమేరాలు నమోదు చేసిన టైముని బట్టి కూడా విషయాలు రూఢి అయ్యాయి.   

నిందితులుపయోగించిన స్కోడా కారు కూడా లభించింది.  హర్యనా పోలీసుల సాయంతో ఢిల్లీ పోలీసులు హర్యనా లోని జింద్ లో ఆ కారుని స్వాధీనం చేసుకున్నారు.  

ఇప్పటి వరకూ పోలీసుల దర్యాప్తులో తెలిసిన విషయాలు-

ఉదయం సుమారు 8.55 కి నిందితులు స్కోడా కారులో నేషనల్ హైవే 8 మీదున్న దీపక్ భరద్వాజ్ ఫామ్ హౌస్ నితేష్ కుంజ్ లోపలికి ప్రవేశించారు.  పెళ్ళి కోసం ఫామ్ హౌస్ ని బుక్ చేసుకుందామనుకుంటున్నట్టుగా చెప్తూ ఆ నెపంతో లోపలికి ప్రవేశించిన హంతకులు భరద్వాజ్ కోసం అడిగి, ఆయనతో వాగ్వివాదంతో మొదలుపెట్టి, రెండు బుల్లెట్లను పోయింట్ బ్లాంక్ రేంజ్ లో ఆయన శరీరంలో దించారు.  దొరికిన ఆధారాలనుబట్టి హంతకులు ఉత్తర ఢిల్లీలో హర్యానా సరిహద్దులో ఉన్న ఖేరా గ్రామానికి చెందినవారని పోలీసులు తెలుసుకున్నారు.  

స్పెషల్ టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగి, హర్యానా, ఉత్తర్ ఖండ్, ఉత్తరాంచల్ రాష్ట్రాలలో హంతకుల కోసం గాలిస్తున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram charan tej birthday celebrated in his absence
Cpi threatens govt to start state wide agitation  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles