Maoist sriramulu srinivas arrested after two years

maoist, sriramulu srinivas, maoist vimala, malkangiri collector vineel krishna, orisha police, andhra police

maoist sriramulu srinivas arrested after two years

maoist.png

Posted: 03/24/2013 03:53 PM IST
Maoist sriramulu srinivas arrested after two years

maoists

నిన్న ఖమ్మంలో అరెస్ట్ చేసిన తీవ్రవాద మావోయిస్ట్ శ్రీరాములు శ్రీనివాస్ ని మేజిస్ట్రేట్ ముందు నిలబెట్టనున్నారు.

vineel-krishnaఒడిశాలో ఎన్నో కేసుల్లో నిందితుడైన శ్రీనివాస్ లోగడ మల్కాన్ గిరి కలెక్టర్ అపహరణకు పాల్పడి బెయిల్ మీద బయటకు వచ్చున్నాడు. ఆ ఘటన జరిగిన రెండు సంవత్సరాల అనంతరం అతన్ని ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు ఖమ్మం జిల్లాలో పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇదేమీ ఆంధ్రాపోలీసుల ఘనతేమీ కాదంటున్నారు ఒడిశా పోలీసులు. మేము సూచననివ్వబట్టే వాళ్ళు పట్టుకున్నారని చెప్తున్నారు. అతని మీద మల్కాన్ గిరిలో చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి అతన్ని మేము తీసుకొస్తామని అంటున్నారు.

 

పక్క ఫొటోలో అపహరణకు గురైన మల్కాన్ గిరి జిల్లా కలెక్టర్ వినీల్ కృష్ణ, ఐపిఎస్.

 

ఆంధ్రా ఒడిశా సరిహద్దులో మావోయిస్ట్ కార్యకలాపాలను సాగిస్తున్న శ్రీరాములు, అతని భార్య విమల కోసం కూడా ఒడిశా పోలీసులు చాలా కాలంగా గాలిస్తున్నారు. వాళ్ళు మల్కాన్ గిరి లోని కలిమేలా ప్రాంతంలో వాళ్ళు సంచరిస్తున్నట్టుగా లభించిన సమాచారాన్ని అందుకుని వాళ్ళని పట్టుకోవటానికి వెళ్ళగా, ఈ సంగతి తెలుసుకున్న వాళ్ళు జీపులో పరారీ అవుతూ ఛత్తీస్ గఢ్ లోంచి ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించారు. సరిహద్దు వరకూ వాళ్ళని వెంబడించిన మల్కాన్ గిరి పోలీసులు ఈ సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులకు అందించగా వాళ్ళు శ్రీరాములును పట్టుకున్నారని మల్కాన్ గిరి పోలీస్ సూపరింటెండెంట్ అఖిలేశ్వర్ సింగ్ తెలియజేసారు.

మమత హాస్పిటల్ నుంచి తీసుకెళ్ళి శ్రీరాములు శ్రీనివాస్ ని న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టటానికి ఖమ్మం పోలీసులు అన్ని ఏర్పాట్లు చేసారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Survey satyanarayana made wild comment ys death
Pak ex president started to karachi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles