Pak ex president started to karachi

pakistan president, ex president musharraf, tehrik e taliban, elections in pakistan

pak ex president started to karachi

musharraf-to-pak.png

Posted: 03/24/2013 01:33 PM IST
Pak ex president started to karachi

musharraf-photoపాకిస్తాన్ మాజీ మిలిటరీ అధ్యక్షుడు పర్వేజ్ ముషర్రఫ్ దాదాపూ నాలుగున్న సంవత్సరాల తనంతట తాను విధించుకున్న అఙాత వాసం తర్వాత తిరిగి తన జన్మభూమికి చేరుకుంటున్నారు. దుబాయ్ నుంచి విమానంలో బయలుదేరిన ముషర్రఫ్ తాను కరాచికి ఒంటిగంటకల్లా చేరుకుంటానని ట్విట్టర్ లో ప్రకటించారు. తెల్లటి సెల్వార్ కమీజ్ లో విమానంలో ప్రయాణం చేస్తున్నట్టుగా తీసిని ఫోటోను కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.

అంతకు ముందే, పాకిస్తాన్ చేరుకున్న తర్వాత మహమ్మద్ అలి జిన్నా గోరీ దగ్గర ముషర్రఫ్ ప్రసంగానికి కరాచీ అధికారులు అనుమతిని రద్దు చేసారు. భద్రతా సమస్యల దృష్ట్యా అనుమతిని రద్దు చేయవలసి వచ్చిందని సింధ్ పోలీస్ తరఫున అధికార ప్రతినిధఇ ఇమ్రాన్ షౌకత్ తెలియజేసారు. ఈ విషయాన్ని ముషర్రఫ్ పార్టీ ఆల్ పాకిస్తాన్ ముస్లిం లీగ్ కి అధికారికంగా తెలియజేసామని, వాళ్ళు ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటున్నామని చెప్పినట్టుగా కూడా ఇమ్రాన్ షౌకత్ తెలియజేసారు.

ముషర్రఫ్ పాకిస్తాన్ కి వస్తున్నానని రెండు రోజుల క్రితం తెలియజేసినప్పుడే బహిష్కరించబడ్డ తెహ్రికే తాలిబాన్ ఉగ్రవాద సంస్థ, ముషర్రఫ్ ని చంపటానికి ఆత్మాహుతి దాడికి సిద్ధం చేసామని ప్రకటించింది. మరో పక్క కోర్టు కేసులో అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. అయినా ముషర్రఫ్ తన దేశానికి తిరిగి వెళ్తానని, ఎన్నికలలో పాల్గొంటానని మొండిగా ప్రకటించి దుబాయ్ నుంచి బయలుదేరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Maoist sriramulu srinivas arrested after two years
Mla dharmapal apologizes for his remarks  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles