Uk tourist jumps from hotel balcony

agra, tajmahal, uk tourist jumps from balcony, uk lady tourist

uk tourist jumps from hotel balcony

tourist-balcony-jump.png

Posted: 03/20/2013 04:39 PM IST
Uk tourist jumps from hotel balcony

taj-mahal

బ్రిటిష్ యువతిమీద హటల్ మేనేజర్ అత్యాచార ప్రయత్న ఆరోపణను హోటల్ మేనేజర్ తరఫు లాయరు ఈరోజు నిరాకరించారు.  ఆమె ఉదయం నాలుగు గంటలకు లేపమని చెప్పటం వలన, ఆ సమయంలో వేరే సిబ్బంది అందుబాటులో లేకపోవటం వలన, ఇంటర్ కం లో ఆ యువతి నుంచి ఎటువంటి సందేశం రాకపోవటం వలన మేనేజర్ స్వయంగా అక్కడికి వెళ్ళవలసి వచ్చిందని లాయరు చెప్పారు.

తాజ్ మహల్ పట్టణం ఆగ్రాలో ఒక హోటల్లో బస చేస్తున్న 31 సంవత్సరాల బ్రిటిష్ యువతి హోటల్ బాల్కనీలోంచి దూకటం వలన కాలికి దెబ్బతగిలింది.  ఈ సంఘటన నిన్న తెల్లవారు ఝామున 4.00 గంటలకు జరిగింది.

టూరిస్ట్ మహిళ కథనం ప్రకారం ఆమె ఉదయం 4.00 గంటలకు నిద్ర లేపమని హోటల్ యాజమాన్యానికి చెప్పింది.  అయితే ఫోన్ ద్వారా లేపకుండా గది కి వచ్చి తలుపు కొట్టాడు.  అతను ఎంతకీ పోకపోవటంతో భయపడ్డ ఆ మహిళ తప్పించుకోవటం కోసం తలుపు లోపలి వైపు తాళం వేసి, బాల్కనీలోకి పోయి అక్కడి నుండి కిందికి దూకింది.  అప్పుడు ఆమెకు కాలికి దెబ్బ తగిలింది.  అయినా ఆమె అక్కడి నుండి పారిపోయి పోలీసులకు ఫిర్యాదు చేసింది.  పోలీసులు అతన్ని అరెస్ట్ చేసారు.

ఆమె కాలికి చికిత్స చేయించి మరో హోటల్ కి తరలించామని అక్కడ ఇద్దరు మహిళా పోలీసులను కాపలా ఉంచామని ఆగ్రా పోలీస్ సూపరింటెండెంట్ సుభాష్ చంద్ర డుబే చెప్పారు.

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  All party meeting called by pm
Sadak bundh programpng  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles