Sadak bundh programpng

sadak-bundh-program.png

Posted: 03/20/2013 04:03 PM IST
Sadak bundh programpng

kodandaram-photoతెలంగాణా ఐక్య కార్యాచరణ సంఘం ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఆకాంక్షను వెలిబుచ్చుతూ చేస్తున్న ఆందోళనలో భాగంగా రూపొందించిన సడక్ బంద్ కార్యక్రమాన్ని రేపు జరపటానికి నిర్ణయించుకున్నారు.  24 గంటలపాటు హైద్రాబాద్ బెంగళూరు హైవే మీద జరిగే ఈ కార్యక్రమానికి లక్ష్యం తెలంగాణా మీద ప్రతిపాదనను శాసన సభలో పెట్టటానికి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవటమేనని ఐకాస ఛైర్మని ప్రొ.కోదండరామ్ అన్నారు.  ప్రభుత్వం ఆ ప్రతిపాదనను పెడితే సడక్ బంద్ ను రద్దుచేసుకుంటామని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోకపోవటంతో ముందు అనుకున్నట్టుగానే ఈ కార్యక్రమాన్ని అమలు పరచటానికి ఐకాస నిర్ణయించుకుందని ఐయన అన్నారు.

హైద్రాబాద్ నుంచి మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్ వరకు 189 కిలోమీటర్ల దూరంలో జరిగే ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీలైనా తెలంగాణా రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ, సిపిఐలు పాల్గొంటున్నాయి.  ఫిబ్రవరి 24 న చేద్దామనుకున్న ఈ కార్యక్రమం ఫిబ్రవరి 21 న దిల్ సుఖ్ నగర్ లో జరిగిన బాంబు పేలుళ్ళ దృష్ట్యా అప్పడు వాయిదా వేసుకున్నారు.  

ఈ విషయంలో ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి హైవేల మీద బంద్ లు జరగకూడదనే ఉద్దేశ్యంతో సడక్ బంద్ కి అనుమతి లేదు కాబట్టి ఆ విషయంలో పోలీసులు తమ పని తాము చేసుకుంటారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.  

ఉద్యమాన్ని అణిచి తెలంగాణా ఆందోళనను అణగదొక్కటానికి ప్రభుత్వం చేసే పనులు విఫలమౌతాయని, ఇప్పటికే 2400 మంది మీద బైండోవర్ కేసులను పోలీసులు పెట్టారని, 10000 మంది పోలీసు బలగాలతో ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవటానికి ప్రయత్నిస్తున్నారని కోదండరామ్ ఆరోపిస్తూ, ఎంత మంది పోలీసులు తెచ్చుకున్నా సరే ఈ కార్యక్రమం విజయవంతమౌతుందని అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Uk tourist jumps from hotel balcony
Dmk rajyasabha memberpng  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles