All party meeting called by pm

manmohan singh, all party meeting, karunanidhi, dmk party, srilanka tamil issue

all party meeting called by pm

all-party-meet.png

Posted: 03/20/2013 05:53 PM IST
All party meeting called by pm

karuna-manmohan

ఈ రాత్రికి శ్రీలంక తమిళుల సమస్య మీద ప్రధాన మంత్రి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసారు.  ఈ రోజు మన్మోహన్ సింగ్ నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో శ్రీలంక తమిళుల సమస్య మీద మన దేశం తీసుకునే నిర్ణయం, శ్రీలంకలో మానవ హక్కుల ఉల్లంఘన విషయంలో అమెరికా మానవ హక్కుల సంఘంలో పెట్టబోతున్న ప్రతిపాదనలో భారత దేశం చేర్చబోయే సవరణల విషయంలో చర్చించారు.  ఈ విషయంలో అన్ని పార్టీల అభిప్రాయాన్ని తీసుకోవటం కోసం సాయంత్రం 7.30 కి ప్రధాని నివాసంలో అఖిల పక్ష సమావేశానికి పిలుపునిచ్చారు.   

అమెరికాలో మానవ హక్కుల కమిషన్ లో శ్రీలంక తమిళుల పట్ల అమానుష చర్యలు యుద్ధ తప్పిదాల మీద నిర్ణయం తీసుకోవటానికి రేపు ఉదయం 10 గంటలకు సమయాన్ని కేటాయించారు.  అందులో సవరణలను చేర్చటానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.  పోయిన సంవత్సరం కూడా భారత్ సహకారంతో ఇటువంటి నిర్ణయం తీసుకోవటంతో శ్రీలంక తప్పనిసరిగా తమిళులతో రాజీకి రావలసివచ్చింది.  2009 నుండి శ్రీలంకలో ఎల్ టి టి ఇ ని అణగదొక్కే ప్రయత్నంలో దాదాపు ఒక లక్షమంది ప్రాణాలు కోల్పోయారని అమెరికా అంచనా.  

అయితే, శ్రీలంకను విడిగా చేసి మానవ హక్కులను ఉల్లంఘించారంటూ ఇటువంటి నిర్ణయాలను తీసుకోవటాన్ని మేము అంగీకరించమంటూ శ్రీలంక విదేశాంగ మంత్రి జి,ఎల్.పెయిరిస్ కొలంబోలో ప్రకటించారు.

డిఎమ్ కె వత్తిడికి లోబడినట్లు కాకుండా తమంతట తామే దీన్నో సమస్యగా పరిగణించి పరిష్కారానికి వెళ్తున్నమన్న సంకేతాన్ని ప్రభుత్వం ఇవ్వదలచుకుంది.  అయితే ఆ గుర్తింపు, రాజకీయ ప్రయోజనం యుపిఏ కి కాకుండా అచ్చంగా తమకే దక్కాలని డిఎమ్ కే ఆరాటపడుతున్నట్టుగా కనిపిస్తోంది.  దాని వలన రాష్ట్ర రాజకీయాల్లో కూడా డిఎమ్ కే కి ప్రయోజనం ఉండవచ్చని పార్టీ అభిప్రాయం.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Every one prepared for sadak bundh
Uk tourist jumps from hotel balcony  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles