Militants kill youth in masjid

militants, terrorists, jammu kashmir, youth shot by militants

militants kill youth in masjid

kashmir-militants.png

Posted: 03/20/2013 03:12 PM IST
Militants kill youth in masjid

ఇంటికన్న గుడిపదిలం అన్న సామెత ఉండేది.  మతం ఏదైనా ఈ నియమం వర్తిస్తుంది.  పవిత్రమైన ప్రార్ధనా మందిరాలలో హింసకు చోటివ్వకపోవటం ఆది నుంచీ అన్ని వర్గాల వారూ అనుసరిస్తున్నదే.  మతం పేరుతో చేసే హింసాకాండలను ఆ మతానికే గౌరవం లభించని విధంగా చెయ్యటం ఏ మతానికి చెందిన సంస్థకీ ధర్మం కాదు.

నిన్న రాత్రి కాశ్మీర్ లోని సోపోర్ పట్టణంలోని మసీదులో 18 సంవత్సరాల యువకుని హత్య జరిగింది.  సుహైల్ అహ్మద్ సోఫీ అనే 18 సంవత్సరాల యువకుడు సోపోర్ లోని మసీదు దగ్గర మరో యువకునితో పాటు కూర్చుని ఉండగా ఉగ్రవాదులు వాళ్ళ మీద తుపాకీతో దాడి చేసారు.  ప్రాణ భయంతో సుహైల్ మసీదు లోపలికి పోయినా ఆ దుండగుడు అతన్ని వదిలిపెట్టలేదు.  మసీదులోనే అతన్ని కాల్చి చంపాడు.  

ఈ పని లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ పనేనని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.  సోపూర్ పోలీస్ కమిషనర్ సయ్యద్ ఇమ్తియాజ్ మాట్లాడుతూ, సుహైల్ బులెట్ దెబ్బకి మసీద్ లో అప్పటికప్పుడే మరణించాడని, గుర్తు తెలియని హంతకుడి మీద కేసు నమోదు చేసామని చెప్పారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dmk rajyasabha memberpng
Chidambaram confidenct of stability of govt  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles