Mulayam moulana pact broken

mulayam singh yadav, shahi imam, sayyad ahmed bukhari, samaj vadi party

mulayam-moulana-pact broken

mulayam-moulana-pact.png

Posted: 03/16/2013 04:16 PM IST
Mulayam moulana pact broken

mulayam-bukhari-pact

సమాజ్ వాది పార్టీ నుంచి తెగతెంపులు చేసుకున్న జామా మస్దీద్ షాహీ ఇమామ్ మౌలానా సయ్యద్ అహ్మద్ బుఖారీ.  

ఎన్నికలప్పుడు సమాజ్ వాదీ పార్టీ నాయకుడు ములాయమ్ సింగ్ యాదవ్ వచ్చి మాకు ఎన్నో వాగ్దానాలు చేసారు.  అందులో ముస్లింలకు 18 శాతం రిజర్వేషన్ చేస్తామని కూడా ఉంది.  ఇప్పటికి సంవత్సరమైంది గద్దె ఎక్కి.  ఇంతవరకూ చేసిన వాగ్దానాల మాటటుంచి, ముస్లింల ప్రాథమిక హక్కులను కూడా పరిరక్షించలేకపోతున్నారు అని ఆలోపించారు బుఖారీ.  

పోయిన సంవత్సరంలో మత కలహాలు 113 సార్లు జరిగాయి, 13 స్థానాల్లో కర్ఫ్యూ విధించటం జరిగింది.  ఇదీ సమాజ్ వాది పార్టీ చేసిన ఘనకార్యం అన్నారు బుఖారి.  అన్నిట్లో నష్టపోతున్నది ముస్లిం సమాజమే.  ప్రభుత్వాధికారాలలో కూడా ముస్లింలకు స్థానమివ్వలేదు.  ఇంతా జరిగాక నిన్న ఆ పార్టీ సంవత్సరం నిండిన సంబరాలు చేసుకుంది.  ఎంత సిగ్గుచేటుగా లేదూ అని ప్రశ్నించారు బుఖారీ.  

ఎమ్మెల్సీగా ఉన్న బుఖారీ అల్లుడు ఉమర్ అలీ ఖాన్, సివిల్ డిఫెంస్ కౌన్సిల్ వసీమ్ అహ్మద్ ఇంకా ఎందరో తన మద్దతుదారులంతా రాజీనామాలు చేసి వారి వారి బాధ్యతలనుంచి తప్పుకున్నారని బుఖారీ తెలియజేసారు.

 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawned girls rescued by police
Anjireddy creamatedpng  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles