Anjireddy creamatedpng

anjireddy-creamation.png

Posted: 03/16/2013 03:43 PM IST
Anjireddy creamatedpng

reddy-labsప్రముఖ వ్యాపారవేత్త, ఔషధ రంగంలో దిగ్గజం అంతర్జాతీయంగా పేరుగాంచిన రెడ్డి ల్యాబ్స్ సంస్థాపకుడు 72 సంవత్సరాల కె.అంజిరెడ్డి నిన్న హైద్రాబాద్ లో అపోలోలో చికిత్స పొందుతూ కన్నుమూసారు.  ఈ రోజు ఆయన అంత్యక్రియలు పంజాగుట్ట స్మశానవాటికలో పలువురు ప్రముఖుల సమక్షంలో జరిగాయి.  అంజిరెడ్డి కుమారుడు సతీష్ రెడ్డి ఆయన చితికి నిప్పు అంటించారు.  కేంద్ర మంత్రులు చిరంజీవి, జైపాల్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మంత్రులు దానం నాగేందర్ రెడ్డి, సినీ నిర్మాత రామానాయుడు, అదనపు డిజి కృష్ణ ప్రసాద్, రెడ్డి ల్యాబ్స్ సిబ్బంది అంజిరెడ్డికి నివాళులర్పించారు.  

సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన కళ్ళం అంజిరెడ్డి, రసాయన శాస్త్రంలో ఉన్నత విద్యనభ్యసించి, ఐడిపిఎల్ లో ఉద్యోగంతో మొదలు పెట్టిన ఆయన వృత్తిరేఖ అంచెలంచలుగా ముందుకు సాగింది.  అందులో పెద్ద మలుపు 25 లక్షల రూపాయల పెట్టుబడితో 1984 లో ఆయన స్థాపించిన రెడ్డి ల్యాబ్స్ అంతర్జాతీయ ఖ్యాతి గాంచి పలువురకు ఉపాధి కల్పించటమే కాకుండా భారతావనికి జీవనదాతగా రూపొందింది.  ప్రాణాలను నిలిపే ఖరీదైన ఔషధాలను భారత్ లోనే తయారుచెయ్యటం కోసం నిరంతర పరిశోధనతో రివర్స్ ఇంజినీరింగ్ పద్ధతిలో జెనెరిక్ రూపాలను రూపొందించి అనేక ఔషధాలకు (బల్క్ డ్రగ్స్ కి) పేటెంట్లను సంపాదించారు.  దానితో భారతదేశ వాసులకు జీవన ప్రదాత అయ్యారు అంజిరెడ్డి.  వేల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ కి చేరుకున్న రెడ్డి ల్యాబ్స్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లో నమోదైన మొదటి ఆసియా కంపెనీగా ఖ్యాతిగాంచింది.  

 గుంటూరు జిల్లా తాడేపల్లిలో పసుపు రైతు కుటుంబంలో జన్మించిన అంజిరెడ్డి వీధిబడిలో చదువుకుని, ప్రపంచ ఖ్యాతిని గడించే బహుళ జాతి సంస్థను స్థాపించే స్థితికి ఎదిగారంటే దీని వెనుక ఆయన దూరదృష్టి, కృషి, పట్టుదల ఎంత ఉన్నాయో ఊహించుకోవచ్చు.  ప్రపంచంలో ఔషధ సంస్థల్లో అగ్రగామైన ఫైజర్ ని దృష్టిలో పెట్టుకుని దాన్ని మించిపోయే లక్ష్యం వైపు గా అడుగులు వేసి సాధించిన అంజిరెడ్డి సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ బిరుదుతో సత్కరించింది.  
ఆయన భార్య సామ్రాజ్యం, కుమార్తె అనూరాధ, కుమారుడు సతీష్ రెడ్డి ఉన్నారు.  కొన్నాళ్ళుగా వ్యాపారంలో చురుగ్గా పాల్గొనలేకుండా ఉన్న కారణంగా కుమారుడు సతీష్ రెడ్డి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గానూ, అల్లుడు జివి ప్రసాద్ వైస్ ఛైర్మన్ గానూ ఆయనకు తోడుగా పనిచేస్తూ వస్తున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mulayam moulana pact broken
Swiss national gang raped in mp  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles