Pawned girls rescued by police

minor girls, police rescue operation, karimnagar district, sexual harassment

pawned girls rescued by police

pawned-girls-rescued.png

Posted: 03/16/2013 04:46 PM IST
Pawned girls rescued by police

కూతుళ్ళను తాకట్టు పెట్టిన తండ్రి, వాళ్ళను పనిలో పెట్టి, అందులో మైనర్ బాలికను లైంగికంగా వేధించిన ఉదంతం కరీం నగర్ జిల్లా మైతాపూర్ లో వెలుగు చూసింది. బాబూలాల్ అనే అతను 6 నెలల క్రితం జహంగీర్ అనే దూరపు బంధువు దగ్గర రూ.34000 తీసుకుని బాకీ పడ్డాడు. బాకీ కట్టమని ఒత్తిడి చెయ్యటంతో గత్యంతరం లేక 14, 5 సంవత్సరాల వయసులో ఉన్న తన ఇద్దరు కూతుళ్ళను అతని దగ్గర హామీగా పెట్టాడు.

అలా వాళ్ళని తీసుకునిపోయిన జహంగీర్ వాళ్ళని కూలి పనిలో పెట్టాడు. అది గమనించిన ఆ గ్రామవాసులు పోలీసులకు ఈ విషయాన్ని చెప్పగా ఈరోజు వాళ్ళు రంగంలోకి దిగి మైనర్ బాలికలనిద్దరనీ జహంగీర్ చెర నుంచి విడిపించారు.

కూలీకి పెట్టటమే కాకుండా జహంగీర్ 14 సంవత్సరాల బాలికను లైంగికంగా వేధించాడని కూడా తెలిసింది. జహంగీర్ ని పలు క్రిమినల్ కేసులు, బాండెడ్ లేబర్ నిరోధక చట్టం కింద అరెస్ట్ చేసామని రాయకల్ సబ్ ఇన్స్ పెక్టర్ కోటేశ్వర్ తెలియజేసారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Srilankan monk surrounded by tamil groups
Mulayam moulana pact broken  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles