Lallu prasad yadav to see that modi will not become pm

lallu prasad yadav, narendra modi, 2014 india general elections

lallu prasad yadav to see that modi will not become pm

lallu-prasad-challenges.png

Posted: 03/10/2013 05:13 PM IST
Lallu prasad yadav to see that modi will not become pm

lalu-prasad-yadav

నా ఒంట్లో ఆఖరు రక్తపు చుక్క ఉన్నంత వరకూ మోదీని ప్రధానమంత్రి కాకుండా అడ్డుపడతా నంటూ శపథం చేస్తున్నారు రాష్ట్రీయ జనతా దళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్.  

మతాల మధ్య చిచ్చుపెట్టి, వర్గపోరుని పెంచి, విద్వేషాలను రేకెత్తించిన మనిషి సర్వ మతాలకూ సమాన హౌదానిచ్చే భారత దేశ ప్రధాని ఎలా అవుతాడు.  నేను కానివ్వను.  నాలాంటి అభిప్రాయం ఉన్నవారందరినీ కూడదీసి, సర్వశక్తలూ వోడి, 2014 సాధారణ ఎన్నికలలో మోదీ కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తా.  ప్రధాన మంత్రి అవుదామని కలలు కంటున్న మోదీ కల కలగానే మిగిలి పోతుందన్నది వాస్తవం అంటూ మాజీ బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రస్తుత గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీకి విషయంలో మీడియా సమావేశంలో తెలియజేసారు.  

గుజరాత్ లో ముఖ్యమంత్రిగా మాత్రమే ఉన్నంత కాలం కేవలం కేంద్ర ప్రభుత్వానికే వ్యతిరేకైన నరేంద్ర మోదీ జాతీయ హోదాను సంతరించుకుని బలాన్ని పుంజుకుంటూ బలమైన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే శక్తివంతుడిగా పరిగణిస్తూ పైకి ఎత్తిన దగ్గర్నుంచీ దేశవ్యాప్తంగా కూడా వ్యతిరేకతలు పెల్లుబుకుతున్నాయి.  2002 లో జరిగిన మారణహోమం మోదీని వెంటాడటం మొదలుపెట్టింది.  అయితే, దీన్ని గమనిస్తున్న మోదీ, 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం స్వార్థరహితంగా పనిచేసినట్లయితే ప్రజలు తప్పక క్షమిస్తారంటూ తన విశ్వాసాన్ని వెలిబుచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Contesting mlc list finalized by cong and tdp
Over 1000 ias did not file fixed assets returns  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles