Over 1000 ias did not file fixed assets returns

ias, department of personnel training, ias returns of assets

over 1000 ias did not file fixed assets returns

ias-returns.png

Posted: 03/10/2013 05:08 PM IST
Over 1000 ias did not file fixed assets returns

ప్రభుత్వోద్యోగులుగా అత్యున్నత పదవిని, అధికారాలను, బాధ్యతలను కూడా కలిగిన వారే ఐఏఎస్ లు.  వాళ్ళు కూడా ఈ మధ్యకాలం లో నేరారోపణలను ఎదుర్కుంటున్నారు.  కొత్త చట్టాలను చేస్తూ పాతవాటిని అవసరమైనప్పుడల్లా సవరిస్తూ, ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించటానికి ఉన్నవారు ప్రజలచేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులైన రాజకీయ నాయకులు.  రాజకీయ నాయకులు ఎప్పటి నుంచో అవినీతి ఆరోపణలను ఎదుర్కుంటూ వస్తున్నారు.  కానీ తాజాగా ఐఏఎస్ లు మీదా ఆరోపణలు రావటమే కాకుండా, మంత్రులను వాళ్ళు తప్పు పట్టటం, ఐఏఎస్ లమీదకు మంత్రులు తోసెయ్యటం కూడా జరుగుతోంది.  పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలను ఎదుర్కుని సిబిఐ విచారణలో ఉన్న ఐఏఎస్ ఆంధ్రప్రదేశ్ కి చెందిన శ్రీలక్ష్మి.  1979 బ్యాచ్ ఐఏఎస్ దంపతులు అరవింద్, టీనూ జోషీలు 2010 లో మధ్యప్రదేశ్ లో ఆదాయ పన్ను విభాగం వారి దాడిలో 350 కోట్ల విలువగల ఆస్తులతో పట్టుబడ్డారు.  

వీటన్నిటి దృష్ట్యా అధికారంలో ఉన్న 4737 ఐఏఎస్ లను వారి వారి ఆస్తులను ప్రకటించవలసిందిగా ప్రభుత్వం కోరినా, 2012 సంవత్సరానికి ఇంకా 1057 మంది వారి వారి స్థిరాస్థి వివరాలను (ఐపిఆర్) సమర్పించలేదు.  అందులో సంఖ్యనుబట్ట పై స్థాయిలో చూసుకుంటే ఉత్తర ప్రదేశ్ నుంచే 147 మంది ఉన్నారు.  ఆంధ్రప్రదేశ్ ఏమీ తక్కువ తినలేదు.  53 మంది ఇంకా వాళ్ళ స్థిరాస్తుల రిటర్న్ ని ఫైల్ చెయ్యవలసివున్నారు.

ప్రతి సంవత్సరం జనవరి నెల లోపులో అఖిల భారత సర్వీస్ లో ఉన్నవారు తప్పని సరిగా అంతకు ముందు సంవత్సరాంతంలో వారి స్థిరాస్తుల వివరాలను అందజేయవలసివుంది.  లేకపోతే వారిని పదవుల్లో ఉన్నతికి అనర్హులగా పరిగణిస్తారు.  పదోన్నతి ఎవరికి కావాలి, అది లేకుండానే కావలసినంత దొరుకుతున్నప్పుడు అని అనుకుంటే అందుకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఇంకా ఏమీ ఆలోచించలేదు.  2010, 2011 సంవత్సరానికి కూడా ఇంకా రిటర్న్ ఫైల్ చెయ్యని వారున్నారని తెలిసింది.  వీరిని నియంత్రించే డిపార్ట్ మెంట్ ఆఫ్ పెర్సనల్ ట్రైనింగ్ ఐఏఎస్ లకు వెంటనే స్థిరాస్తుల రిటర్న్ లు ఫైల్ చెయ్యమంటూ సర్కులర్ ని పంపించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lallu prasad yadav to see that modi will not become pm
Narendra modipng  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles