Contesting mlc list finalized by cong and tdp

congress party of india, telugu desam party, members of legislative council, andhra pradesh

contesting mlc list finalized by cong and tdp

mlc-contest.png

Posted: 03/10/2013 05:41 PM IST
Contesting mlc list finalized by cong and tdp

ఢిల్లీ వెళ్ళి సోనియా గాంధీతో సమావేశమై వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడ బొత్సా సత్యనారాయణ తాము ఖరారు చేసిన ఎమ్మెల్సీ జాబితాకు ఆమోద ముద్ర వేయించుకున్నట్లుగా తెలుస్తోంది.  ఖమ్మం నుంచి పొంగులేటి సుధాకర రెడ్డి, కరీం నగర్ నుంచి సంతోష్ కుమార్, నిజామాబాద్ నుంచి షబ్బీర్ అలీ, తూర్పు గోదావరి జిల్లా నుంచి లక్ష్మీ శివకుమారి, విజయనగరం నుంచి కొలగొట్ల వీరభద్రస్వామి పేర్లు ఖరారయ్యాయి.  గవర్నర్ కోటాలో కంతేటి సత్యనారాయణ రాజుకి అవకాశం చిక్కింది.  

అయితే కేంద్ర పర్యాటక శాఖకు అమాత్యులుగా పనిచేస్తున్న చిరంజీవి కోటగిరి విద్యాధరరావుకి ఎమ్మెల్సీ టికెట్ ఇప్పించటానికి సిఫారసు చేసారు.  అది కుదరని పక్షంలో గౌతం కి ఇవ్వమని కోరినా ఫలితం లేకపోయింది.  కుల సమీకరణల దృష్ట్యా ప్రత్యామ్నాయం సూచించినా చిరంజీవి సూచించిన ఇద్దరిలో ఏ అభ్యర్థికీ ఎమ్మెల్సీ అవకాశం లభించలేదు.

ఇటు తెలుగుదేశం పార్టీలో కూడా ఎమ్మెల్సీ పోటీకి అభ్యర్థులను ఎంపిక చేసి రంగం సిద్ధం చేసారు.  ఎమ్మెల్సీ పోటీ ఉన్న మూడు ప్రాంతాలకూ యనమల రామకృష్ణుడు, మహమ్మద్ సలీం, శమంతక మణిల పేర్లను ఎంపిక చేసారు.  

తెదేపా సీనియర్ నేత దాడి వీరభద్రరావు కి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం దక్కనందుకు ఆయన మనస్తాపాన్ని వ్యక్తపరచారు.  ఈ సంగతి ముందే తెలిస్తే నా అంతట నేనే ముందుగానే తప్పుకునేవాడిని కదా అన్నారాయన.  యనమలకు అవకాశం ఇవ్వటంలో తనకి ఏ మాత్రం అభ్యంతరం లేదు కానీ తను పదవీకాలాన్ని కొనసాగించాలనుకోవటంలో కూడా తప్పు లేదు కదా అన్నారాయన.  అయినా తాను తెదేపా కి పనిచేస్తాననే అన్నారాయన.  కాకపోతే అధిష్టానం తీరుని నిరసించారు.

దాడి వీరభద్రరావు బాధను తను అర్థం చేసుకోగలనని ఆకివీడులో పాదయాత్రలో ఉన్న తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.  దాడికి ముందుగా సమాచారం ఇవ్వలేదన్నది నిజమే కానీ, పార్టీ దృష్ట్యా, సామాజిక న్యాయం దృష్ట్యా కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకోవలసి వస్తుందని ఆయన అన్నారు.

అన్ని ప్రాంతల వర్గాలనూ దృష్టిలో పెట్టుకునే అభ్యర్థుల ఎంపిక జరిగిందని పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ తెలియజేసారు.   అయితే, మైనారిటీలకు తెదేపా లోనే గుర్తింపు ఎక్కువగా ఉంటుందన్న విశ్వాసాన్ని తెదేపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైన సలీం అన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Apcc president botsa satyanaryana announces preparedness
Lallu prasad yadav to see that modi will not become pm  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles