Chandra babu comment on congress party and ysrcp

chandrababu naidu, tdp president, comments, congress party, cm kirankumar reddy, ysrcp, ys rajashekar reddy, ys jaganmohan reddy

chandra babu comment on congress party and ysrcp

chandra-babu.gif

Posted: 03/05/2013 04:48 PM IST
Chandra babu comment on congress party and ysrcp

chandra babu comment on congress party and ysrcp

 వస్తున్నా మీకోసం యాత్రలో  చంద్రబాబు  క్రిష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో  పర్యటించిన సందర్భంలో  కాంగ్రెస్ పార్టీ, వైఎఆర్ కాంగ్రెస్ పార్టీల పై  నిప్పులు కురిపించారు. రాష్ట్రంలో యువతకు ఉపాది లేకుంటే   సమాజం పై  ద్వేషంతో  పక్కదారి  పట్టే ప్రమాదం  ఉందన్నారు.   అవేమీ పట్టని  కాంగ్రెస్  ప్రభుత్వం  అవినీతితో  జేబులు నింపుకొని, పొట్టలు పెంచుకుని  రాష్ట్రాన్ని   భ్రష్టుపట్టించారన్నారు.  వైఎస్  అవినీతి కారణంగా  విద్యుత్తు  కొరత ఏర్పడిందని,  విద్యుత్తు ఉంటేనే పరిశ్రమలు వస్తాయన్నారు. పరిశ్రమలతోనే  అభివ్రుద్ది  సాధ్యమని,  పరిశ్రమలు  ఉంటే  యువతకు  ఉపాది   అవకాశాలు  ఉంటాయని  చంద్రబాబు చెప్పారు.  తమ హాయంలో లక్షల  మందికి సాప్ట్ వేర్ ఉద్యోగాలు  వచ్చాయంటే , ప్రస్తుతం  అందరిచేతుల్లో  సెల్ పోన్లు  ఉన్నాయంటే  తెలుగుదేశం పార్టీ   వలనే  జరిగిందని  బాబు అన్నారు.  దేశంలో  నాలెడ్జ్  సొసైటీగా  ఆంద్రప్రదేశ్ ను  మార్చిన ఘనత  టీడీపీ దని   చంద్రబాబు గుర్తు చేశారు.  కాంగ్రెస్   దొంగల  ప్రభుత్వంగా  మారిందని , లంచాలు తిని ఇష్టారాజ్యంగా  కళాశాలలకు  అనుమతి ఇచ్చి. విద్యార్థల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుకుంటుందని  చంద్రబాబు అన్నారు.  ఒకప్పుడు  ఇన్ఫర్మేషన్  టెక్నాలజీ కి చిరునామాగా ఆంద్రప్రదేశ్  పేరు మారుమోగేదీ.  బిల్ గేట్స్ తో సహా ఐటీ  మహామహులందరు ఇక్కడికి  వచ్చేవారు.  పెట్టుబడులు  పెట్టేవారు.  ఉపాది  అవకాశాలు  దక్కాయి.  ఐటీ, ఐఐఎం, ఐఏఎస్ ఇలా అన్నింటా  ఆంధ్రప్రదేశ్ దే అధిపత్యం. మరి ఇప్పుడు  పెట్టుబడుల  పెట్టేందుకు  సిద్దమైన వారుకూడా పారిపోతున్నారు.  బీహార్, గుజరాత్ లకు వెళ్లిపోతున్నారు.  యువతకు  ఉద్యోగావకాశాలు  లేవు. వైఎస్ తో  సహా కాంగ్రెస్  అవినీతి,  ఆ చెట్టు  కొమ్మ నుంచి  పిల్ల కాంగ్రెస్ లే  ఈ పరిస్థితికి  కారణం. గతంలో  ఐటీ హబ్ గా  ఉన్న  ఆంధ్రప్రదేశ్ లో నేడు లూటీల హబ్ గా మారిందని  చంద్రబాబు ఆవేశంగా  అన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  4 year old falls out of third story window lands on his feet
Priyanka gandhi undergoes surgery  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles