Arvind kejriwal to speak in place of modi announces aam admi party

wharton idia economic forum, narendra modi, arvind kejriwal, aam admi party,

arvind kejriwal to speak in place of modi announces aam admi party

narendra-modi-kejriwal.png

Posted: 03/05/2013 12:09 PM IST
Arvind kejriwal to speak in place of modi announces aam admi party


modi-kejriwalవార్టన్ స్కూల్ యాజమాన్యం, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ ఉపన్యాసాన్ని రద్దు చేసామని చిట్టచివరకు అధికారికంగా ప్రకటించారు. వార్టన్ స్కూల్ విద్యార్థలు ఈ ఫోరమ్ గురించి చేస్తున్న కృషిని కొనియాడుతూ, ఈ మోదీ విషయంలో జరిగిన సందిగ్ధతావస్థకు విచారిస్తున్నామని కూడా వార్టన్ స్కూల్ తెలియజేసింది.

1996 నుంచి భారత దేశ వ్యాపార, వాణిజ్య రంగంలో దృష్టి పెడుతూ, భారత దేశంలోని వ్యాపారావకాశాల గురించి విశదీకరించటానికి వేదికగా తయారైన వార్టన్ ఇండియా ఎకానామిక్ ఫోరం లో ఇంత వరకూ ఎందరో వక్తలు ప్రసంగిస్తూ వచ్చారు. అందులో డా.అబ్దుల్ కలామ్, పి.చిదంబరం, ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ ఉన్నారు.

23 మార్చిన జరగబోయే ఈ కార్యక్రమంలో ఈసారి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య ప్రసంగీకులుగా ముందు ఆహ్వానించబడ్డారు. కానీ గుజరాత్ లో జరిగిన వర్గపోరాటాలు, హింసా కాండకు కారకుడని మోదీ మీద వచ్చిన ఆరోపణల దృష్ట్యా ఆయన ప్రసంగానికి ఇండో అమెరికన్ వాసులైన భారతీయులు, విశ్వవిద్యాలయ ప్రోఫెసర్ల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువడడంతో ఆయన ప్రసంగాన్ని రద్దు చెయ్యవలసి వచ్చింది. ఈ విషయం ఇంతవరకూ అనధికారికంగా బయటకు పొక్కినా, ఇప్పుడు అధికారిక ప్రకటన వెలువడింది.

మోదీ స్థానంలో అరవింద్ కేజ్రీవాల్ ని వార్టన్ కమిటీ ఆ వేడుకలో ప్రసంగీకులుగా ఆహ్వానిస్తున్నారంటూ ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. అయితే ఇంతవరకూ అటువంటి ప్రకటనేమీ చెయ్యలేదని వార్టన్ అధికార ప్రతినిధి అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Priyanka gandhi undergoes surgery
Delhi gang rape victim honored international courageous women award  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles