Powere cuts in the state scheduled from today

power cuts, electricity scarcity, ap transco

powere cuts in the state scheduled from today

power-cuts.png

Posted: 03/01/2013 10:02 AM IST
Powere cuts in the state scheduled from today

ap-transco

వేసవి కాలం వచ్చిందంటే పరీక్షల హడావిడి, పిల్లలకు శలవులు, పెళ్ళళ్ళు, పర్యటనలు మొదలవుతాయి.  వీటన్నిటికంటే ముందు వేసవి వచ్చిందని తెలియటానికి సూచన విద్యుత్ కోతలు.  ఈ రోజు నుంచి విద్యుత్ కోతలు మొదలవుతున్నాయి.  2 నుంచి 12 గంటల వరకూ ఉండే విద్యుత్ సరఫరాలో కోతలు ఆయా ప్రాంతాలను బట్టి ఉంటాయి.  నగరాల్లో రెండు గంటలైతే జిల్లా కేంద్రాల్లో నాలుగు గంటలు, మున్సిపాలిటీలలో 6 గంటలు, మండల కేంద్రాల్లో 8 గంటలు, పల్లె ప్రాంతాల్లో 12 గంటల విద్యుత్ కోత అధికార ప్రకటనలో ఉన్నదే. 

గ్రేటర్ హైద్రాబాద్ లో ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట విద్యుత్ కోత ఉంటుంది.  జిల్లా కేంద్రాలలో ఉదయం, మధ్యాహ్నం రెండు రెండు గంటలు,   పురపాలక పట్టణాలలో ఉదయం, మధ్యాహ్నం మూడు మూడు గంటల చొప్పున, మండల కేంద్రాలలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ విద్యుత్ కోతలుంటాయి.  వ్యవసాయానికి ఏడు గంటల పాటు విద్యుత్ సరఫరా ఇస్తున్న గ్రామాలకు పగలు ఏడు గంటలు మాత్రమే విద్యుతు ఉంటుంది. 

అధికారిక ప్రకటనలే ఇలా ఉంటే ఇక అనధికార కోతలు మాటేంటి, పల్లెల్లో ఇక కరెంటు కల్లే అనుకుంటున్నారు.  చాలు చాలు అసలు కష్టమంతా మాది అంటారు విద్యుత్ సంస్థల వాళ్ళు.  ఉష్ణోగ్రతతో కరెంటు అవసరమూ పెరుగుతుంటుందని, దానికి తగ్గట్టుగా విద్యుత్తు అందకపోతే దానికి మేమేం చెయ్యగలం, ఉన్నదాన్ని సర్దటంలో మా తల ప్రాణం తోకకి వస్తోంది అంటారు.  నిన్న 306106 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం పడితే, అందుకు కేవలం 237572 యూనిట్లు మాత్రమే సరఫరా చెయ్యటానికి వీలైంది అని చెప్తున్నారు.

  అదనంగా విద్యుత్ ను ఉత్పత్తి చెయ్యాలనే ఆకాంక్షతో ఉన్నా, ఏ విధంగా చెయ్యాలన్నది ట్రాన్స్ కో నిర్ణయించుకోలేకపోతున్నది.  ఆర్ ఎల్ ఎన్ జీ, నాఫ్తాలతో చర్చలు సాగిస్తున్న ట్రాన్స్ కో సిఎమ్ డి సమారియా ఇంకా ఇదమిద్ధంగా ఏమీ తేల్చుకోలేకుండా ఉన్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Indian ngo savera working hard for dubai labourers
State budget to be introduced on 13th  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles