Indian ngo savera working hard for dubai labourers

dubai, ngo, manual workers

indian ngo savera working hard for dubai labourers

ngo-service-at-dubai.png

Posted: 03/01/2013 02:50 PM IST
Indian ngo savera working hard for dubai labourers

ngo-for-labourers

పెద్ద చదువు లేక కాయకష్టం మీదనే ఆధారపడి పని చేసుకుంటున్నవారికి ఆ తర్వాత పనిలో పడి చదువుకోవటానికి సమయం ఉండదు.  అలాంటి వాళ్ళను, సమాజంలో వెనకబడిపోయి ఉన్నామే అనే బాధ అప్పుడప్పుడూ కలచివేస్తుంటుంది.  బ్లూకాలర్ అనబడే వాళ్ళు వైట్ కాలర్ లోకి పరివర్తనం చెందాలని ఆశపడి, అందుకు కావలసిన ఆసక్తి, ఉత్సాహం, కృషి చేసే పట్టుదల ఉన్నంత మాత్రాన చాలదు అందుకు అందుబాటులో శిక్షణా కేంద్రాలు, అందుకు తగ్గ వాతావరణం కూడా ఉండాలి. 

తెలివితేటలుండీ, వాటిని ఉపయోగించుకునే అవకాశం లేక యువత లోని సామర్థ్యం ఎంతో వృధా అయిపోతుంటుంది.  అలాంటి వారి కోసం శిక్షణా కేంద్రాలను ఏర్పరచి వారిని తీర్చి దిద్దాలనే ఆలోచనను కార్య రూపంలో పెట్టారు భారత్ కి చెందిన స్వచ్ఛంద సంస్థ సవేరా, మరో దుబాయ్ కి చెందిన సంస్థ.

దుబాయ్ లో అల్ క్వోజ్, సోనాపుర్ కార్మికుల నివాస ప్రాంతాలలో ప్రతి శుక్రవారం రెండు గంటలు సుంకం లేని శిక్షణనిస్తూ కార్మికులకు చేయూతనిస్తున్నారు.  వాళ్ళు నిర్వహించే తరగతులలో ఇంగ్లీషుతో పాటు కార్మికులకు ఉపయోగయోగ్యమైన వివరాలతో ఙానాన్ని అందజేస్తున్నారు.  సవేరా అధ్యక్షురాలు, కోలకతా ఇండియన్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంటులో పట్టభద్రురాలు నీతా మాథుర్ దుబాయ్ లో కార్మిక సంక్షేమం కోసం అహర్నిశలూ పాటుపడుతున్నారు.  2011 లో భారత రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ దుబాయ్ పర్యటనలో ఉన్నప్పుడు కలుసుకుని భారతదేశవాసులకు ఏదైనా మంచి చేద్దామని ఉందన్న కోరికను వెలిబుచ్చినప్పుడు ఆయన, భారతదేశవాసుల సంగతి వదిలిపెట్టి, ఇక్కడ దుబాయ్ లో ఉన్న మన దేశస్తులకు మేలు చెయ్యండి అని సలహా ఇచ్చారట. 

దానితో ప్రేరణ చెంది, భారత్ నుంచి వచ్చి అక్కడ పని చేసుకుంటున్నవారి కోసం చెయ్య దగ్గ సేవా కార్యక్రమాన్ని రూపొందించి ప్రారంభించగా, ఇంతవరకు వందమంది భారతీయ కార్మికులు ఇంగ్లీషు, కంప్యూటర్ కోర్సులను చేసారు.  సవేరా లో పనిచేసే కార్యకర్తలు రూపొందించిన పాఠ్యభాగాలతో ఔత్సాహికులైన కార్మికులకు ఫీజు లేకుండా శిక్షణ నిచ్చామని, విశ్వవిద్యాలయంలో ని ఆచార్యులు తయారు చేసిన ఆ పాఠ్యభాగాలతో వివిధ తరగతులను నిర్వహిస్తున్నామని, కోల్కతా లో ఐఐఎమ్ లో చదువుకుని సవేరాలో ప్రాజెక్ట్ హెడ్ గా పనిచేస్తున్న డా.సురేష్ నందా చెప్పారు. 

ఇంగ్లీషు, కంప్యూటర్, సాంకేతిక విద్యకూ అవసరమైన కోర్సు లను తయారు చేసి భారత దేశస్తులే కాక పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ కి చెందిన కార్మికులకు కూడా శిక్షణనివ్వటం ద్వారా వాళ్ళంతా అనతి కాలంలోనే తాము చేసే పనిలో మార్పు, ఆదాయంలో వృద్ధిని మాత్రమే కాకుండా, ఆత్మస్థైర్యాన్ని ఆత్మసంతృప్తిని కూడా పొందారు.  ఉద్యోగవకాశాల తో  దుబాయ్ నుంచి ఇతర దేశాలకు పోవటానికి కూడా కొందరికి అవకాశం లభిస్తోంది. 

అది చూసి, స్వచ్ఛంద సేవా సంస్థలో పనిచేసే వారంతా తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు.  ఈ సమాజానికి ఏదో చెయ్యాలనే మా ఆకాంక్ష ఈవిధంగా నెరవేరుతోంది అంటున్నారు. 

శిక్షణ పూర్తి చేసుకున్న వారి ఆనందానికిక అంతు లేదు.  చక్కగా ఇంగ్లీషులో మాట్లాడగలగటం, కంప్యూటర్ ని ఉపయోగించగలగటం వారి జీవితాల్లో ఆత్మానందంతో పాటు మేమూ సాధించామన్న తృప్తిని కలుగజేస్తున్నాయంటున్నారు.

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cm n kiran kumar reddy presents rs 50 lakh to saina nehwal
Powere cuts in the state scheduled from today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles