State budget to be introduced on 13th

ap state budget, finance minister, parliament

state budget to be introduced on 13th

ap-budget.png

Posted: 03/01/2013 09:58 AM IST
State budget to be introduced on 13th

minister-anam

కేంద్ర బడ్జెట్లు పూర్తయ్యాయి ఇక రాష్ట్రం లోని బడ్జెట్ సమావేశాలున్నాయి.  ఈ నెల 13 న ప్రారంభం కానున్న శాసన సభ లో బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని, అందుకు రెండు సభల అధ్యక్షులను అర్థించామని, ఆర్థిక మంత్రి ఆనం రాం నారాయణ రెడ్డి అన్నారు.  2013-14 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను 18 న ప్రవేశపెడతామని, దాని మీద మార్చి 22 వరకూ చర్చలుంటాయని ఆయన అన్నారు. 

నిజానికి ప్రతి సంవత్సరం 18 రోజుల పాటు వివిధ పద్దుల మీద చర్చలు జరగాలి కానీ గత నాలుగు సంవత్సరాలుగా ఆ పని జరగటం లేదని, అందువలన ఈ సంవత్సరం దాన్ని అమలుపరుస్తూ, దానితో పాటు పార్లమెంటు తరహాలో 12 సభా సంఘాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా మార్చి 23 నుండి ఏప్రిల్ 22 వరకూ సమీక్షలు నిర్వహిస్తామని, ఏప్రిల్ 23 నుండి మే 2 వరకూ తిరిగి చర్చలు ఉంటాయని, ఆ తర్వాతనే బడ్జెట్ ప్రతిపాదనలు అమలులోకి వస్తాయని ఆనం అన్నారు. 

రాష్ట్రంలో అన్ని శాఖల బడ్జెట్ పూర్తి అయిందని, అందుకు గాను తాను స్వయంగా ఆయా శాఖల మంత్రులతో చర్చలు జరిపానని, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు ఇతర శాఖలు ముఖ్యకార్యదర్శులు,  ప్రధాన కార్యదర్శితో చర్చలు జరిపారని, ఆనం తెలియజేసారు.

కత్తిమీద సాములాంటి బడ్జెట్ తయారీ నిజంగా ఒక పరీక్షే అయిపోతోంది.  ఖర్చులు తగ్గించాలి, రాబడి పెంచుకోవాలి, పన్నుల వాత పెట్టకూడదు, సామాన్యుడికి కష్టం కలగకూడదు, ఇలా అన్నీ ఆలోచించి చేసినా, ప్రతిపక్షాల విమర్శలు ఎలాగూ తప్పవు.  శాసన సభలో బడ్జెట్ పర్వం ఎలా సాగుతుందో వేచి చూడాల్సిందే. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Powere cuts in the state scheduled from today
11 indians in pak jails scheduled to release today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles