Center statement on telangana statehood

gulam nabi azad, shinde, home minister shinde, center statement on telangana, susheel kumar shinde, statehood, telangana agitation,samara deeksha, samaradeeksha, ou students, trs, t jac,

center statement on telangana statehood

29.gif

Posted: 01/27/2013 06:40 PM IST
Center statement on telangana statehood

shi

       జనవరి 28 వతేదీ కి గత నెలరోజులుగా యమ క్రేజ్ వచ్చిపడింది. తీరా ఆతేదీ రేపు సమీపిస్తుందనగా అందరి ఊహాగానాలూ పటాపంచలైపోయాయ్. దీనికంతటికీ కారణం తెలంగాణ అంశంమీద కేంద్రానికి ఉన్న చిత్తశుద్ది.  తెలంగాణపై ఒక నిర్ణయం తీసుకోవడానికి తుది గడువు అంటూ ఏదీలేదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు గులాంనబీ ఆజాద్ చెప్పారు. కొంచెం సేపటిక్రితం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.
         రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కేంద్ర హొం శాఖ వివరిస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు, ఇతర సీనియర్ నేతలను ఢిల్లీకి పిలిపిస్తున్నామని వారితో సంప్రదింపులు జరుపవలసి ఉందన్నారు. సంప్రదింపుల ప్రక్రియ పూర్తి కాలేదని, మరింత సమయం పడుతుందని చెప్పారు. మూడు ప్రాంతాల సీనియర్ నేతలతో ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు చర్చించవలసి ఉందన్నారు. తాను చెబుతున్నది పార్టీ అభిప్రాయం మాత్రమేనని, ప్రభుత్వం తరపున అభిప్రాయం కేంద్ర హొం శాఖ చెబుతుందని వెల్లడించారు.

c
      ఇదిలాఉండగా, ఈ ఆంశంమీద ఈ ఉదయంనుంచీ తీవ్ర ఉత్కంఠ నెలకొంది.  తెలంగాణపై ప్రకటన చేయడానికి కేంద్ర హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే విధించిన గడువు రేపటితో ముగుస్తున్న నేపధ్యంలో అంతా వేయి కళ్లతో ఎదురు చూశారు. తెలంగాణ అంశంపై చర్చించడానికి కాంగ్రెస్ కోర్ కమిటీ ఈ సాయంత్రం ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో సమావేశమైంది. ఈ రాత్రికి షిండే ఢాకా వెళ్లనున్నారు. ఈ పరిస్థితులలో సాయంత్రం 5.15 గంటలకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు గులాంనబీ ఆజాద్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆయన తెలంగాణపై ప్రకటన చేసే అవకాశం ఉందిని, కొద్దిసేపట్లో తెలంగాణపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని చాలా మంది భావించారు. అయితే  రెండు రోజుల క్రితం ఆజాద్ మాట్లాడిన మాటలను పరిగణనలోకి తీసుకుంటే మరికొద్ది రోజులు గడువు కోరే అవకాశం ఉందని భావించినట్టే చివరకు ఆజాద్ మొండిచేయి చూపించి తెలంగాణ వాదులనేకాదు యావత్ రాష్ట్ర ప్రజలకు ఒట్టిచేయి చూపించారు.
      కాగా కేంద్రం తీరుపై టీఆర్ఎస్ తో పాటు అన్నా రాజకీయపక్షాలూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

        అయితే అజాద్ ప్రెస్ మీట్ అనంతరం మాటనిలబెట్టుకోలేక మొఖం చాటేసిన కేంద్ర హోంమంత్రి షిండే  నోట్ విడుదలచేశారు.  తెలంగాణపై సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతోందని కేంద్ర హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి మరికొంత సమయం పడుతుందని ఆయన తెలిపారు. అంతకు ముందు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు గులాంనబీ ఆజాద్ చేసిన ప్రకటనకు కొనసాగింపుగానే షిండే ప్రెస్ నోట్ ఉండటం విశేషం..

oo
         కేంద్రం మళ్లీ మటనిలుపుకోని నేపథ్యంలో ఇందిరా పార్కు వద్ద తెలంగాణ నేతల సమరదీక్ష నేపధ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే ప్రమాదం కనిపిస్తోంది. ఆజాద్ వ్యాఖ్యల పట్ల తెలంగాణ వాదులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. సమరదీక్ష వేదిక వద్దకు తెలంగాణ నలుమూలల నుంచి జనం వేలాదిగా తరలి వస్తున్నారు. రేపు ఉదయానికి జనం భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది. సమరదీక్ష వద్దకు రేపు ఉదయం ర్యాలీగా వెళతామని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల జెఎసి నేతలు చెప్పారు. పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వారు హెచ్చరించారు. సమరదీక్షలో పాల్గొనటానికి పోలీసులు రెండు వేల మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. అయినప్పటికీ అత్యధిక సంఖ్యలో తరలి వచ్చే అన్ని వర్గాల ప్రజలను, విద్యార్థులను పోలీసులు అదుపు చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా  ఎప్పుడు ఏం జరుగుతుందో అని ముఖ్యంగా ఓయూ ప్రాంత ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Final verdict on telangana issue
Aircargo from visakhapatnam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles