Final verdict on telangana issue

telangan issue, telangana, congress core, congress govt, upa2, tdp, sonia, manmohan, rahul gandhi, film news, moive news, telanga agitations, final verdict on telangana issue

final verdict on telangana issue

1.gif

Posted: 01/27/2013 12:57 PM IST
Final verdict on telangana issue

tt

        ఇక మీనమేషాలకు తావులేదు.. తేల్చేద్దాం.. ఇది తెలంగాణ అంశం మీద సోనియా మదిలోని మాట. అంతేకాదు తెలంగాణకు సంబంధించి ప్రకటన చేసే ముందు కట్టుదిట్టమైన గట్టి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలిసింది.. ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, కేంద్ర మంత్రులు చిదంబరం, ఏకే ఆంటోనీ, సుశీల్ కుమార్ షిండే.. సోనియాతో ఈ విషయమై సుధీర్ఘంగా చర్చించారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్ ప్రత్యేక ఆహ్వానితుడిగా ఈ భేటీలో పాల్గొన్నారు. వీరంతా భవిష్యత్ కార్యాచరణపై మేడమ్‌తో కీలక సమాలోచనలు జరిపినట్లు తెలిసింది. రాజమండ్రిలో 'జై ఆంధ్రప్రదేశ్' పేరిట జరిగిన సభ కూడా సమావేశంలో చర్చకు వచ్చింది. రాష్ట్రంలో క్రమక్రమంగా మరోసారి ఘర్షణ వాతావరణం తీవ్రతరమవుతోందని, పార్టీలో పూర్తిస్థాయి విభజన కనిపిస్తోందని కోర్ కమిటీ సభ్యుడు ఒకరు వివరించినట్లు తెలిసింది. పరిస్థితిని ఇదే విధంగా కొనసాగించడం మంచిది కాదని కూడా వారు అభిప్రాయపడ్డారు.
      షిండే సోమవారం బంగ్లాదేశ్ వెళుతున్నందువల్ల ఆయన వెళ్లేలోపు ఒక ప్రకటన చేసే అవకాశాలపైనా సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. అయితే, అన్ని అంశాలను కూలంకషంగా పరిశీలించిన తర్వాతే నిర్దిష్ట ప్రకటన చేయాలని, ప్రకటన చేసిన తర్వాత తలెత్తే పర్యవసానాలను ఎదుర్కొనేందుకు ముందుగా కట్టుదిట్టమైన చర్యలను తీసుకున్న తర్వాతే ప్రకటనకు పూనుకోవాలని పార్టీ నేతలు భావించారు. బంగ్లాదేశ్‌లో రెండు రోజుల పర్యటన నుంచి షిండే తిరిగి వచ్చిన తర్వాత ఫిబ్రవరి మొదటి వారంలో ఒక స్పష్టత ఏర్పర్చే దిశగా చర్యలను ప్రారంభించాలని కూడా పార్టీ నేతలు భావిస్తున్నారు. షిండే తిరిగి వచ్చిన వెంటనే ఈ నెలాఖరులో లేదా ఫిబ్రవరి 1న సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణలను ఢిల్లీకి పిలిపించి మాట్లాడిన మీదట ఫైనల్ డెసిషన్ వెల్లడిస్తారని తెలుస్తోంది.

        ఇదంతా పక్కనపెడితే... మన కాంగ్రెస్ అధిష్టానం చివరికి ఇలా లింక్ లో తేల్చింది.... http://www.teluguwishesh.com/teluguhome/190-flash-news/41790-center-statement-on-telangana-statehood.html

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Government green signal for samara deeksha
Center statement on telangana statehood  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles