Aircargo from visakhapatnam

visakhapatnam airport, visakha shipyard, visakha, vizag, film news, movie news, aircargo from visakhapatnam, visakha tourism,

aircargo from visakhapatnam

7.gif

Posted: 01/27/2013 06:06 PM IST
Aircargo from visakhapatnam

aaa

      సహజ సిద్ధ రేవు నగరం విశాఖ నుంచి అంతర్జాతీయ ఎయిర్‌కార్గోకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. దీనికి అవసరమైన అన్ని రకాల అనుమతులు వచ్చినట్టు విశాఖ విమాన ప్రయాణికుల సంఘం (వాటా) తెలిపింది. విమానాశ్రయంలో పాత టెర్మినల్ భవనాన్ని కార్గో కోసం ప్రత్యేకంగా కేటాయించారు. అయితే అందులో తగిన సాంకేతిక ఏర్పాట్లు లేవు. సమకూర్చుకోవడానికి ఇంకో రెండు నెలల సమయం పడుతుంది.
ఈలోపు సరకును విదేశాలకు రవాణా చేయాలనుకుంటే విమానాశ్రయం డైరెక్టర్ శ్రీనివాసరావును సంప్రదిస్తే తగిన ఏర్పాట్లు చేస్తారని వాటా పేర్కొంది.
    కాగా,  ప్రస్తుతం విశాఖపట్నం నుంచి దుబాయ్, సింగపూర్‌లకు విమానాలు నడుస్తున్నాయి. అంతర్జాతీయ కార్గో హ్యాండ్లింగ్‌కు అనుమతులు లేకపోవడం వల్ల విదేశాలకు సరుకు రవాణా చేసే ఫార్మా కంపెనీలు, అత్యవసరంగా చేర్చాల్సిన పండ్లు, చేపల ఉత్పత్తులను హైదరాబాద్ మీదుగా గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. సిల్క్ ఎయిర్‌వేస్ నేరుగా సింగపూర్ నుంచి 90 అంతర్జాతీయ పట్టణాలకు కనెక్టివిటీ ఏర్పాటు చేయడంతో ప్రపంచంలో ఎక్కడికైనా ఆ కంపెనీ ద్వారా సరుకులు పంపించుకొనే వీలుంది.  కార్గోకు అనుమతులు రావడంతో సిల్క్ ఎయిర్ ఈ బాధ్యతలను నిర్వహించేందుకు క్లియరింగ్ అండ్ ఫార్వర్డింగ్ ఏజెంట్లను నియమించే పనిలో నిమగ్నమైంది. కొద్దిరోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తవుతుందని స్థానిక సిల్క్ ఎయిర్ ప్రతినిధి రవీంద్రన్ తెలిపారు. కొత్త విమానాశ్రయంలో కార్గో హ్యాండ్లింగ్‌కు అవసరమైన అన్ని వసతులు ఉన్నాయి. పాత టెర్మినల్ పూర్తిస్థాయి కార్గో సెంటర్‌గా మారేంతవరకు దీన్ని ఉపయోగించుకొని సరుకు రవాణా చేసుకునే వెసులుబాటు ఉంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Center statement on telangana statehood
Viswaroopam movie ban in malasia  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles