Maoist party jagan call for republic day boycott

maoist party jagan, republic day, boycott, telangana issue, congress party, jagan,

maoist party jagan call for republic day boycott

maoist party jagan.gif

Posted: 01/24/2013 12:25 PM IST
Maoist party jagan call for republic day boycott

maoist party jagan call for  republic day  boycott

తెలంగాణ ప్రజలను వంచిస్తున్న కేంద్రం వైకరికి నిరసనగా రిపబ్లిక్ డే వేడుకలను బహిస్కరించాలని మావోయిస్టు పార్టీ ఉత్తర తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు. 60 ఎళ్లుగా కాంగ్రెస్ నాటకం ఆడుతున్నదనేది ఆజాద్ మాటలతో మరోసారి బయటపడిదన్నారు. తెలంగాణ కోసం ఉన్న పార్టీలు కూడా ఆ డ్రామాలో భాగమవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ మెదటినుంచి మోసం చేస్తూనే ఉన్నదని, మరో సారి అదే విధానాన్ని కొనసాగిస్తూ తన నిజస్వరుపాన్ని బయటపెట్టుకుందని జగన్ ధ్వజమెత్తారు.  తెలంగాణ ఉద్యమాన్ని పలుమార్లు అణచివేసిన చరిత్ర కాంగ్రెస్‌ది అని ఆయన మండి పడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని చెప్పిన వాగ్దానం నుంచి వెనక్కుపోవటంలో కాంగ్రెస్‌కు వెన్నతో పెట్టిన విద్య అని జగన్ విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అపహస్యం చేసిన కేంద్రప్రభుత్వని వ్యతిరేకంగా గణతంత్ర దినోత్సవాన్ని బహిష్కరించి నల్ల జెండాలతో మిలిటెంట్ ప్రదర్శన చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పాలక పార్టీల మోసాలను ఎండగడుతూ 2009 పవంబర 29 నుంచి డిసెంబర్ 9 వరకు సాగిన మిలిటెంట పోరాటం వలే ఉద్యమించి కేంద్రం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొవాలని ఆయన పిలుపునిచ్చారు. మిలిటెంట్ పోరాటం చేయకుండా తెలంగాణ రాదనే విషయం మావోయిస్టు పార్టీ మొదటినుండి చెబుతూనే ఉన్నదని ఆయన గుర్తు చేశారు. ఇంకా ప్రలోభాలకు, మోసాలకు, కమిటీల వాగ్దానాలకు నమ్మి మోసపోవద్దన్నారు. ఈ కీలక దశలో అన్ని జేఏసీలు, ప్రజాసంఘాలు, పార్టీలు, సంస్థలు, కవులు, కళాకరులు, కార్మిక, ఉద్యోగ, విద్యార్థి, యువజన, మేధావి సంఘాలు, ప్రగతిశీలురు ఐక్యమై మిలిటెంట్ పోరాటాలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telangana students republic day on kcr house attacked
Uddhav thackeray takes charge as shiv sena president  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles