Uddhav thackeray takes charge as shiv sena president

uddhav thackeray, bal thackeray, president uddhav thackeray, shiv sena supremo bal thackeray, shiv sena president

Uddhav Thackeray takes charge as Shiv Sena president

Uddhav Thackeray.gif

Posted: 01/24/2013 12:21 PM IST
Uddhav thackeray takes charge as shiv sena president

Uddhav Thackeray takes charge as Shiv Sena president

శివసేన కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉద్ధవ్‌ థాకరే ఆ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇక్కడ జరిగిన ఆ పార్టీ ఎగ్జిక్యూటివ్‌ సమావేశంలో లాంఛన ప్రాయంగా ఈ ఎన్నిక జరిగింది. 'పార్టీ అధ్యక్షుడిగా ఉద్ధవ్‌ థాకరే (52) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇకమీదట, పార్టీ అన్ని విధానపరమైన నిర్ణయాలు ఆయన తీసుకుంటారు. పార్టీలో ఏ పదవుల్లో ఎవరిని నియమించాలనే దానిపై కూడా ఆయన అధికారం కలిగివుంటారు' అని పార్టీ సీనియర్‌ నేత సుభాష్‌ దేశారు దాదర్‌లోని శివసేన్‌ కేంద్రకార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఈ ఎన్నికల ప్రక్రియను ఎలక్షన్‌ అధికారి బాలకృష్ణ జోషి పూర్తి చేశారని అన్నారు. గత నాలుగు దశాబ్దాలుగా పార్టీ అధినేత బాల్‌ థాకరే నిర్వహించిన శివసేన 'ప్రముఖ్‌' పేరుతో ఏ పదవీ వుండబోదని చెప్పారు. అలాగే కార్యనిర్వాహక అధ్యక్షుడు పదవి కూడా వుండదన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించాలని పార్టీ నేతలకు ఉద్దవ్‌ థాకరే ఈ సందర్భంగా పార్టీ నేతలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ ఎన్‌సిపి కూటమిపక్షాన్ని గద్దెదించేందుకు మరిన్ని సీట్లు సాధించేలా కృషిచేయాలని కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Maoist party jagan call for republic day boycott
Kvp stops t formation  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles