Government offices to work 5 days a week

government offices, 5 days a week, government office, current saving, working hours, power saving, jobs, government employees

Government offices to work 5 days a week

Government offices.gif

Posted: 01/23/2013 06:29 PM IST
Government offices to work 5 days a week

Government offices to work 5 days a week

 ప్రభుత్వ పనిదినాలు, పనివేళల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాధ్యూ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర విద్యుత్‌ పొదుపు మిషన్‌ (ఎస్‌ఇసిఎం) ఉన్నతస్థాయి సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రం ఎదుర్కొంటున్న విద్యుత్‌ సంక్షోభాన్ని కొంత మేర తీర్చేందుకు పనివేళలు, పనిదినాలు మార్చాలని సిఐఐ ప్రతినిధులు తమ అభిప్రాయాలు వ్యక్తపరిచారు. పరిశ్రమలకు విద్యుత్‌ కొరతతో ఇబ్బందులు వస్తున్నాయని, పనివేళల, పనిదినాలను మార్చడం ద్వారా సుమారుగా రోజుకు 6 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం తగ్గుతుందని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సంస్కరణలు చేపట్టడం ద్వారా మిగిలిన విద్యుత్‌ను పరిశ్రమలకు సరఫరా చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, తమిళనాడు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రస్తుతం అవలంభిస్తున్న విధానం ప్రకారం వారానికి ఐదు రోజులే పనిచేయాలని, వారాంతపు రెండు రోజులు సెలవు ప్రకటిస్తే ఆ మేరకు భారీస్థాయిలో కరంటు ఆదా అవుతుందని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాకుండా పనిదినాల్లో పనివేళలను మార్చాలని సూచించారు. ఉదయం 10:30 నుంచి 11 గంటల మధ్యలో ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి, సాధారణంగా సాయంత్రం 5 గంటల వరకు ఉంటారని చెబుతూనే ఉదయం 9 గంటల కంటే ముందుగానే విధులకు హాజరయ్యేలా చేయగలిగితే నష్టపోయిన పనిదినాలను ఈ విధంగా పూడ్చుకోవచ్చని సూచించారు. అయితే దీనిపై జరిగిన చర్చలో అధికారులంతా పాల్గొనడంతో ఇది ఎటో వెళుతుందని గ్రహించిన సిఎస్‌ మధ్యలో జోక్యం చేసుకొని పనివేళలు, పనిదినాలు మార్చితే ప్రభుత్వ కార్యాలయాల్లో ఎంత మేర విద్యుత్‌ ఆదా అవుతుందో నివేదికనివ్వాలని ఆదేశించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rahul gandhi takes charge as congress vice president
Minister tg venkatesh high command telangana issue  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles