Gang rape victim not recovered yet

delhi gangrape, gangrape victim friend, uttar pradesh, delhi.

gang rape victim is recovering in the hospital, ... the victim is able to communicate but the doctors are not allowing her to.

Gang rape victim not recovered.png

Posted: 12/24/2012 08:59 AM IST
Gang rape victim not recovered yet

Gang_rapeదేశ రాజధాని ఢిల్లీలో సామూహిక హత్యాచారానికి గురైన వైద్యవిద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు విద్యార్థికి చికిత్స చేస్తున్న సస్దర్ జంగ్ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ బీడీ అథనీ తెలిపారు. స్పృహలోకి వచ్చి  మాట్లాడుతోందని, ఆదివారం ఆమె కడుపులో పోగైన ద్రవాలను శుభ్రం చేసేందుకు ఓ శస్త్రచికిత్స నిర్వహించామని, తర్వాత ఐసీయూలోనే వెంటిలేటర్‌పై ఉంచినట్లు చెప్పారు. శనివారం నుంచి ఆమె రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోతూ, పెరుగుతూ ఉందని, దీంతోపాటు ఆమెకు సెప్సిస్ (రక్తంలో ఇన్‌ఫెక్షన్) సోకిందన్నారు. దీనివల్ల అవయవాలు విఫలమయ్యే ప్రమాదముండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. అలాగే, బైలురూబిన్ (పచ్చని ద్రవం) కూడా శనివారం కంటే పెరిగిందని తెలిపారు. సందర్భాన్ని బట్టి వెంటిలేటర్‌పై ఉంచడం వల్ల ఆమె పరిస్థితి మెరుగుపడుతుందని భావిస్తున్నామన్నారు. శుక్రవారం నుంచి చికిత్స పొందుతున్న ఆమెకు శ్వాస సంబంధమైన ఇబ్బంది తలెత్తడంతోపాటు తీవ్రమైన జ్వరమూ వచ్చిందన్నారు. ఆమె ఆరోగ్యం కోసం ఉన్నతస్థాయి ప్రమాణాలు పాటిస్తున్నామని తెలిపారు. బాధితురాలు కోలుకోవడానికి శాయశక్తులా శ్రమిస్తున్నామని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bjp leader venkaiah naidu demands
Ap chief secretary  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles