Ap chief secretary

AP Chief Secretary.png

Posted: 12/24/2012 08:34 AM IST
Ap chief secretary

AP_Chief_Secretaryఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రస్తుత ప్రధాన కార్యదర్శి (సీఎస్) మిన్నీ మాథ్యూస్ ఈనెల చివరిలో పదవి విరమణ చేయనుండటంతో.... ఆ స్థానంలో  కొత్త వారిని నియమించేందుకు కసరత్తులు ప్రారంభించారు. ఈ పదవి కోసం పలువురు కొత్త వారు పోటీ పడుతున్నారు. అందులో ప్రస్తుత సీసీఎల్ ఏ శామ్యూల్ ముందంజలో ఉన్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈయన వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈయన 1978 బ్యాచీకి చెందిన ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన వాడు. ఇప్పటి వరకు కీలక శాఖల్లో సమర్దవంతమైన సేవలందించ డంతోపాటు,ఐఏఎస్‌ వర్గాల్లోనూ శామ్యూల్‌కు మంచి పట్టు ఉంది. దీనికి తోడు కేబినెట్‌ మంత్రులు, అ ధికార పార్టీ కీలక నేతలతోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలుండడంతోపాటు దళిత సామాజిక వర్గానికి చెందినవాడు కావడం ఈయనకు కలిసి వచ్చే అంశాలు. అంతేకాకుండా శామ్యూల్‌కు(1978)ముందు 1977 బ్యాచీలో నల్గురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు ఉన్నప్పటికీ ఈయన వైపే ముఖ్యమంత్రి ఆసక్తి చూపుతున్నారని అంటున్నాయి అధికార వర్గాలు. మరి ఈ పదవి ఎవరికి దక్కుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gang rape victim not recovered yet
Telangana alliance wins seemandhra  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles