Today world aids day

World Aids Day, AP, HIV/AIDS, health, prevention, hiv, aids, ahn, CDC, World AIDS Day, research treatment

World AIDS Day 2012 More Hopeful Than in Past

World Aids Day.png

Posted: 12/01/2012 09:33 AM IST
Today world aids day

World_aids_dayదేశంలో ప్రాణాంతక వ్యాధి ఎయిడ్స్. ఈరోజు 'ప్రపంచ ఎయిడ్స్ డే'. ఈ సందర్భంగా  దీనిని పూర్తిగా నివారించేందుకు  ప్రభుత్వాలు నడుం బిగించి, దీని వ్రుద్ధి రేటును గత 8 ఏళ్లలో గణనీయంగా తగ్గించాయి. ఎయిడ్స్ డే సందర్భంగా  పలు సంస్థలు ఎయిడ్స్‌పై నివేదికలను విడుదల చేశాయి. వాటి ప్రకారం భారత్‌లో ప్రాణాంతక హెచ్ఐవీ బారిన పడుతున్న బాధితులు ఏటా తగ్గిపోతున్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అంచనాల ప్రకారం దేశంలోని 15 నుంచి 49ఏళ్ల వయసు వారిలో 2007లో 0.33శాతం మందికి హెచ్ఐవీ సోకగా, 2011నాటికి ఈ రేటు 0.27శాతానికి తగ్గిందని తేల్చాయి. ఎనిమిదేళ్ల క్రితంతో పోల్చితే ఇప్పుడు 50శాతం కేసులు త గ్గాయని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ పేర్కొంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఎయిడ్స్ నియంత్రణను బాగా అమలు చేస్తుండటంతో పాజిటివ్ కేసుల్లో భారీ తగ్గుదల కనిపిస్తోంది. 2004లో 15శాతం ఉన్న ఈ రేటు ఇప్పుడు ఐదు శాతానికి తగ్గిందని ప్రోగ్రామింగ్ మేనేజర్ డాక్టర్ శ్రీధర్ వివరించారు..

మన దేశంలో 50 శాతం తగ్గినా, ఇప్పటికీ దేశంలో మన రాష్ట్రమే అగ్రస్థానంలో ఉంది. మొత్తం 23.9లక్షల మంది రోగుల్లో సుమారు 5.20లక్షల మంది రాష్ట్రంలోనే ఉన్నారు. హెచ్ఐవీ వ్యాపిస్తున్న రేటు రాష్ట్రంలోనే ఎక్కువగా ఉంది. ఇది కొద్దిగా ఆలోచించాల్సిన  విషయం. దీని పై ప్రభుత్వం మరింత అవగాహన కల్సించి, ఎయిడ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రజలు కోరుతున్నారు. .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sonia gandhi congratulated the cm kiran
Cm kiran kumar reddy fire  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles