Sonia gandhi congratulated the cm kiran

Kiran Kumar Reddy, Sonia gandhi, AICC chief, soina, N.kiran kuram reddy,congratulated,CM Kiran

In a rare gesture Congress president Sonia Gandhi has congratulated the Chief Minister Kiran Kumar Reddy.

Sonia Gandhi congratulated the CM Kiran.png

Posted: 12/01/2012 09:47 AM IST
Sonia gandhi congratulated the cm kiran

Cm_kiranమన రాష్ట్ర ముఖ్యమంత్రి  కిరణ్ కుమార్ రెడ్డికి మంచి రోజలు వచ్చాయా ? మొన్నటి వరకు ఎప్పుడు పదవి పోతుందో అని బిక్కు బిక్కు మని గడిపిన ఆయనకు ఇప్పటి పరిస్థితి చూస్తుంటే  మంచి రోజుల వచ్చినట్లే కనిపిస్తుంది. ఆయనకు ఏకంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా అభినందించడం, నిన్న పార్లమెంటు వాయిదా తరువాత మీడియా ఆయన ఘాటుగా మాట్లాడిన తీరు చూస్తుంటే.... కిరణ్ ఎవరికి వినడం లేదనిపిస్తుంది. ఇక నిన్న శాసనసభలో ప్రవేశ పెట్టిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించాలంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అభినందించారు. శుక్రవారం ఆమె ఫోన్‌లో కిరణ్‌ను ప్రశంసించారు. బిల్లును శాసనసభలో ప్రవేశ పెట్టామని, దీనిపై రెండు రోజులపాటు చర్చ జరగనుందని సోనియాకు కిరణ్ వివరించారు. దేశంలోనే చరిత్రాత్మకమైన బిల్లును మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టడం అభినందనీయమని, ఎస్సీ, ఎస్టీల సామాజిక, ఆర్థిక, మానవ వనరుల అభివృద్ధిలో జరిగిన లోటు ఈ బిల్లుద్వారా భర్తీ అవుతుందని, వారి ప్రయోజనాలను కాపాడే అవకాశం కలిగిందని సోనియా అన్నారు.

కాగా, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ త్వరలో రాష్ట్రానికి రానున్నారు. ఈ మేరకు సీఎం కిరణ్ సంకేతమిచ్చారు.  సోనియా నుండి ఫోన్ రావడంతో కిరణ్ ఎగిరి గంతేశాడని, ఇక తన పదవికి ఢోకా లేదని ఆయన అనుకుంటున్నాడని  అంటున్నారు కాంగ్రెస్ నాయకులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bharati against tdp chief naidu kuppam constituency
Today world aids day  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles