Andhra pradesh assembly sessions

andhra pradesh assembly, assembly meetings, legislature, legislative council, assembly meeting, andhra pradesh, politics in ap, congress, tdp, trs, ysrcp, sessions coming

andhra pradesh assembly sessions coming

20.gif

Posted: 11/25/2012 03:18 PM IST
Andhra pradesh assembly sessions

      ap_assembly

       రాష్ట్ర శాసనసభ, శాసన మండలి సమావేశాలు ఈనెల 30 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ పేరిట నోటిఫికేషన్ జారీ అయ్యింది. 30వ తేదీ ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయని అందులో పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టబద్ధతబిల్లుపై చర్చించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమైంది.
        అయితే వీటిని రెండ్రోజులు మాత్రమే నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు సమాచారం. సభ ఎన్ని రోజులు జరపాలి, ఏయే అంశాలను ప్రస్తావించాలనే అంశాలపై శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ(బీఏసీ)లో చర్చించిన తర్వాతే అధికారికంగా ఎజెండా ఖరారు చేయనున్నారు. శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగే బీఏసీ సమావేశాన్ని ఏరోజు నిర్వహించాలనేది ఇంకా ఖరారు కాలేదు.
     కాగా, ఈనెల 29వ తేదీ సాయంత్రం లేదా 30న ఉదయం బీఏసీ సమావేశమయ్యే అవకాశాలున్నాయని శాసనసభ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల కార్యక్రమంతో పాటు మరే ఇతర కార్యక్రమాలు లేకుండా కేవలం సబ్‌ప్లాన్ అంశంపైనే చర్చ పెట్టే అవకాశాలు ఉన్నాయి. అటు విపక్షాలు, స్వపక్ష నేతలు ప్రభుత్వాన్ని వివిధ అంశాలమీద ఇరకాటంలోకి నెట్టాలని చూస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp leader motkupalli fire on kcr
Phones tapping in india  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles