Tdp leader motkupalli fire on kcr

kcr, motkupalli narsimhulu, trs president kcr, tdp leader motkupalli, kcr vs motkupalli narsimhulu, tdp, trs, ktr, congress, tdp leader motkupalli fire on kcr

tdp leader motkupalli fire on kcr

3.gif

Posted: 11/25/2012 12:37 PM IST
Tdp leader motkupalli fire on kcr

kcr_motkupalli

టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావును తీవ్రస్థాయిలో విమర్శించారు టీడీపీ నేత మోత్కుపల్లి నర్శింహులు. కేసీఆర్ ను కసబ్ లా ఉరితీయాలన్నారు. తెలంగాణవాదాన్ని అడ్డంపెట్టుకుని పదవులు అనుభవిస్తున్నాడన్నారు.
        అఖిలపక్షం ఏర్పాటు చేయడం లేదా పార్లమెంట్ లో తన వాదన వినిపించడం చేస్తేనే తెలంగాణ వస్తుందన్నారు. సభల్లో మాట్లాడితే తెలంగాణరాదని చెప్పారు. కాంగ్రెస్ తో కుమ్మక్కై కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో కేసిఆర్ నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ కింగ్ ఆఫ్ చీటర్ అండ్ రాబర్ అని అన్నారు.
        ఈ ఉదయం(ఆదివారం) గన్ పార్క్ వద్ద దీక్ష చేస్తోన్న టీడీపీ నేత మోత్కుపల్లి నరసింహులును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా టిడిపి నేతలు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. మోత్కుపల్లిని పోలీసులు నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్లారు. సూర్యాపేటలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ సభను నిరసిస్తూ అమరవీరుల స్థూపం వద్ద మోత్కుపల్లి నిరాహార దీక్ష ప్రారంభించారు. దీక్ష ప్రారంభించిన కొద్దిసేపటికే ఆయనను అరెస్ట్ చేశారు.

         కాగా టీఆర్ఎస్ పార్టీ సూర్యాపేటలో ఏర్పాటు చేసిన తెలంగాణ సమరభేరి విజయవంతమైంది. కేసీఆర్ పదునైన మాటల పదజాలంతో  సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు. ఆప్రాంతమంతా తెలంగాణవాదులతో కిక్కిరిసిపోయింది. జై తెలంగాణ నినాదాలు మార్మోగాయి. ఈ సభా వేదిక నుంచి కేసీఆర్ ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bjp suspends ram jethmalani
Andhra pradesh assembly sessions  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles