అత్యున్నత న్యాయస్థానం నుంచి స్పష్టమైన ఆదేశాలున్నా, నిబంధనలు అనుమతించకపోయినా ఒడిషాలో ఏకంగా 4,620 ఫోన్లు ట్యాప్ చేసేశారు. 2008-12 మధ్యకాలంలో ల్యాండ్ లైన్లు, మొబైల్ ఫోన్లు కలిపి నాలుగువేల ఆరొందల ఇరవై ఫోన్లను ట్యాప్ చేసింది. భువనేశ్వర్‌కు చెందిన న్యాయవాది బిశ్వప్రియ కనుంగో సమాచార హక్కు చట్టం (ఆర్టిఐ) కింద ఈ వాస్తవాలు రాబట్టారు.
2008 డిసెంబర్ 29 నుంచి 2012 సెప్టెంబర్ 15 వరకూ ఫోన్లు ట్యాప్ చేసినట్టు వెల్లడైంది. రాష్ట్రంలో ఎలాంటి అత్యవసర పరిస్థితులూ లేకపోయినా ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున ఫోన్లు ట్యాపింగ్‌కు పాల్పడడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పబ్లిక్ ఎమర్జన్సీ లేదా పబ్లిక్ సేఫ్టీ వంటి అత్యవసర సమయాల్లో ఫోన్లపై నిఘా ఉంచడం లేదా ట్యాప్ చేయడానికి ప్రభుత్వానికి అధికారం ఉందని అంటూ ఎలాంటి కారణం లేకుండా వేలాది ఫోన్లను ట్యాప్ చేశారని న్యాయవాది విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. సరైన కారణం లేకుండా ఫోన్లు ట్యాప్ చేయడం ప్రజల గోప్యతపై దాడి చేయడం అలాగే మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఫోన్ల ట్యాపింగ్‌కు సంబంధించి వివరాలు కావాలని సెప్టెంబర్‌లో తాను ఆర్‌టిఐను కోరితే నవంబర్‌లో సమాధానం వచ్చినట్టు బిశ్వప్రియ స్పష్టం చేశారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more