Central minister chidambaram on money transfer

chidambaram, union minister, central minister chidambaram on money transfer, money transfer scheme, central government, union govt, money transfer scheme, indian govt, central cabinet,

central minister chidambaram on money transfer

13.gif

Posted: 11/25/2012 02:27 PM IST
Central minister chidambaram on money transfer

      chidambaram

      దేశంలోని 15 రాష్ట్రాల్లో గల 51 జిల్లాల్లో ‘ఆధార్’ వ్యవస్థ ద్వారా ప్రజలకు నేరుగా నగదు సబ్సిడీ చెల్లించే ప్రక్రియను జనవరి 1 నుంచి ప్రభుత్వం ప్రారంభిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పి.చిదంబరం తెలిపారు. 2013 చివరి నాటికి దేశమంతటా ఈ ప్రక్రియను అమలులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోందని ఆయన చెప్పారు. ఈ ప్రక్రియ వలన సంబంధిత లబ్ధిదారులకు నేరుగా నగదు సబ్సిడీలు చెల్లించేందుకు వీలుకలుగుతుందని ఆయన అన్నారు.
       పుణేలో జరిగిన బాంకొన్ సదస్సులో చిదంబరం ఈ విషయాన్ని వెల్లడించారు. పెన్షన్లు, వివిధ సబ్సిడీల కోసం ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలను వెచ్చిస్తోందని ఆయన చెప్పారు. ఈ నగదు బదిలీ పథకాన్ని అమలుచేసే విషయమై ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ రేపు (సోమవారం) సంబంధిత కమిటీతో సమావేశం జరుపుతారని చిదంబరం తెలిపారు.
         ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందని, ఈ ఏడాది రెండో క్వార్టర్‌లో ఆర్థికాభివృద్ధి రేటు 5.5 శాతంగా ఉంటుందని భావిస్తున్నామని ఆయన చెప్పారు. 8 శాతం ఆర్థికాభివృద్ధి సాధించాలన్నది మన ఆకాంక్ష కాకూడదని, 8 శాతం కంటే ఎక్కువ వృద్ధిరేటు సాధించాలని మనం కాంక్షించాలని చిదంబరం అన్నారు.

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Find out duplicate drugs
Rottela panduga in nellore  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh