అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అధికార యంత్రాంగంలో భారత-అమెరికన్ మహిళకు కీలకస్థానం దక్కింది. అక్కడి నేషనల్ మ్యూజియం-లైబ్రరీ సర్వీసెస్ బోర్డు మెంబర్‌గా విశాఖా దేశాయ్ నియమితులయ్యారు. ఈ మేరకు అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. దేశాయ్ ప్రస్తుతం అంతర్జాతీయ సంస్థ ఆసియా సొసైటీకి అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. భారత్‌కు చెందిన దేశాయ్ బాంబే యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ పట్టాను, మిచిగాన్ వర్సిటీలో ఎంఏ, పీహెచ్‌డీని పూర్తిచేశారు.1977-1990 వరకు బోస్టన్లోని ఫైన్ ఆర్ట్స్ మ్యూజియంలో పనిచేశారు. అక్కడ భారత్, ఆగ్నేయాసియా, ఇస్లామిక్ కళాకృతులకు పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తూ.. 1981-90 వరకు అసిస్టెంట్ క్యూరేటర్‌గా వ్యవహరించారు. 1981-88 వరకు అకడమిక్ ప్రోగ్రామ్స్‌కు హెడ్‌గా, పలు వర్సిటీలకు విజిటింగ్ ఫ్యాకల్టీగా పనిచేశారు. 1988-90 వరకు మాస్సాచుసెట్స్ విశ్వవిద్యాలయంలో అధ్యాపకురాలిగా విధులు నిర్వహించారు. 1998-99 వరకు అసోసియేషన్ ఆఫ్ ఆర్ట్ మ్యూజియం డెరైక్టర్స్‌కు అధ్యక్షురాలిగా వ్యవహరించారు. న్యూయార్క్ పట్టణ సాంస్కృతిక వ్యవహారాల కమిషన్‌కు సలహాదారుగా కూడా సేవలందిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more