Driven by poverty kasab took to crime and jihad

amir shahban kasab, ajmal kasab, kasab, 26/11, terror attacks , pakistan, faridkot, kasab home ,

Driven by poverty, Kasab took to crime and jihad

jihad.gif

Posted: 11/22/2012 01:28 PM IST
Driven by poverty kasab took to crime and jihad

Driven by poverty, Kasab took to crime and jihad

అజ్మల్ కసబ్ పూర్తి పేరు మహ్మద్ అజ్మల్ అమీర్ ఇమాన్. పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్‌కోట్ అతడి స్వగ్రామం. తండ్రి మహ్మద్ అమీర్ ఇమాన్. ఊర్లో చిన్న దుకాణం నడుపుతూ పొట్టపోసుకునే పేదజీవి. తల్లిపేరు నూర్. వీరికి ఐదుగురు పిల్లలు. కసబ్ మూడోవాడు. 1987లో పుట్టాడు. పేదరికం కారణంగా 2000 సంవత్సరంలో నాలుగో తరగతిలోనే చదువుకు స్వస్తిచెప్పాడు. అతడి సోదరుడు అఫ్జల్ లాహోర్‌లో కూలీగా పని చేసేవాడు. కసబ్ కూడా లాహోర్ వెళ్లి 2005 వరకూ సోదరుడితో పాటు దినసరి కూలీగా పని చేశాడు. ఈద్ రోజున తనకు కొత్త బట్టలు తేలేదంటూ 2005లో తండ్రితో గొడవపడ్డాడు. ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. లాహోర్‌లో అలీ అజ్వారీ దర్బార్ అనే సంస్థ చెంతకు చేరాడు. అక్కడుండగానే జెహ్లం నుంచి వచ్చిన షఫీఖ్ ద్వారా వంటవాడిగా మారాడు. తొలినాళ్లల్లో రోజుకు రూ. 120, రూ. 200 వేతనం పొందుతూ 2007 వరకు పని చేశాడు.ఈ నేపథ్యంలోనే ముజఫర్ లాల్ ఖాన్ అనే వ్యక్తితో ఇతడికి పరిచయమైంది. ఇరువురూ కలిసి తేలిగ్గా డబ్బు సంపాదించడానికి చిన్న చిన్న నేరాలు మొదలుపెట్టారు. పెద్ద దోపిడీలు చేయాలని నిర్ణయించుకుని రావల్పిండి చేరుకున్నారు. తుపాకుల కోసం రావల్పిండిలోని రాజా బజార్‌లో లష్కరేతోయిబాకు చెందిన దుకాణాలకు వెళ్లారు. అక్కడే వారు లష్కరే తోయిబాలో చేరారు. 2008 నవంబర్‌లో ముంబైపై దాడి చేయటానికి ఆరు నెలల ముందు కసబ్ తన గ్రామంలో చివరిసారి కనిపించాడు.జీహాద్’ చేయటానికి వెళ్తున్నందున తల్లి నుంచి ఆశీర్వాదం తీసుకోవాలని అతడు గ్రామానికి వచ్చినట్లు భావిస్తున్నారు. ముంబై దాడుల్లో అతడు పాల్గొంటే.. అతడు అమరుడు అవుతాడు కాబట్టి.. అతడి కుటుంబానికి రూ. 1,50,000 చెల్లిస్తామని లష్కరే తోయిబా కసబ్‌కు హామీ ఇచ్చినట్లు చెప్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Google earth satellite map help to kasab
Obama names vishakha desai to museum board  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles