It department enquiry on bala sai

bala sai, bala saibaba, IT department ride, it rides on balasi, kurnool ashram, bala saibaba devotees, bala sai trust, rs.6 crores in auto, police case, hyd police sease money it department enquiry on bala sai

it department enquiry on bala sai

11.gif

Posted: 11/11/2012 01:50 PM IST
It department enquiry on bala sai

bala_saiee

డిజిపి కార్యాలయం వద్ద ఈనెల 7న ఆటోలో 6.47 కోట్ల రూపాయల నోట్ల కట్టలను సిసిఎస్ పోలీసులు స్వాధీనం చేసుకున్న కేసులో ఆదాయ పన్ను శాఖ కర్నూలుకు చెందిన బాలసాయిబాబా ట్రస్టుకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఇంత భారీ మొత్తంలో నోట్ల కట్టలను పోలీసులు స్వాధీనం చేసుకోవడం రాష్టవ్య్రాప్తంగా సంచలనం సృష్టించింది. నోట్ల కట్టల కేసులో నగదు మొత్తాన్ని బ్యాంకు నుంచి డ్రా చేసి స్థిరాస్తి కొనుగోలుకు వినియోగిస్తున్నట్టు చెబుతూ పోలీసుల వద్దకు 8న తుమ్మపల్లి రామారావు అనే వ్యక్తి వచ్చి సమాచారం ఇచ్చిన విషయం విదితమే. రామారావు బాలసాయి బాబా ట్రస్టు ప్రతినిధిగా ఉన్నారు.
           మైసూరులో బాలసాయి బాబా ట్రస్టు ఒక స్ధలం కొనుగోలు నిమిత్తం ఈ సొమ్ములో 4.50 కోట్ల రూపాయలను బ్యాంకు నుంచి, మిగిలిన సొమ్మును శిష్యుల నుంచి సేకరించి మధ్యవర్తికి ఇచ్చేందుకు ఆటోలో తరలిస్తున్నామని రామారావు సైఫాబాద్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఈ నగదును సిసిఎస్ పోలీసులు ఆదాయం పన్ను శాఖకు అప్పగించారు. ప్రస్తుతం బాలసాయిబాబా ట్రస్టు ఆదాయం వివరాలను తెలియచేయాల్సిందిగా ఆదాయం పన్ను శాఖ కర్నూలు ట్రస్టుకు నోటీసులు జారీ చేసింది. సంతృప్తికరమైన సమాధానాన్ని బట్టి తదుపరి చర్యలు ఉంటాయని ఐటి శాఖ వర్గాలు పేర్కొన్నాయి.
        కర్నూలులోని బాలసాయి ఆశ్రమంలో ఐటి దాడులు జరుగుతాయన్న వార్తల నేపథ్యంలో  గేటుకు తాళం కనిపించింది. హైదరాబాద్‌లో ఆటోలో తరలిస్తున్న ట్రస్టు డబ్బు పోలీసులకు చిక్కన తరువాత కర్నూలు ఆశ్రమంపై దాడులు జరుగుతాయన్న వార్తలు వినవచ్చాయి. దీంతో ఆశ్రమానికి చేరుకున్న విలేఖరులకు అక్కడి ఎలాంటి సమాచారం లభించలేదు. ఆశ్రమం గేటుకు తాళం కనిపించింది. దీనిపై చుట్టుపక్కల వారిని సంప్రదించగా చాలా రోజులుగా కేవలం ఉదయం, సాయంత్రం పూట మాత్రమే ఆశ్రమం తెరుస్తున్నారని, మిగతా సమయంలో మూసే ఉంటోందని తెలిపారు. ఆశ్రమానికి గతంలో ఉన్న వైభవం నేడులేదని, రామారావు ఎప్పుడో ఒకసారి వచ్చివెళ్తుంటారని, భక్తలెవరూ రావడం లేదని తెలుస్తోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Madhya pradesh cm opposes dominance of english
Election commissioner banwarlal appeal to degree holders  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles