Tdp leaders new reasons to yerramnaidu death

yerram naidu death new reason, tdp leaders newreason yerram nadiu death, tdp leader yerran naidu, tdp, yerram naidu, yerran naidu, kinjarapu yerran naidu, yerram naidu in road accident, tdp leader yerram naidu dies in road accident, yerram naidu death new resons, yerram naidu not killed, doctors treated filed, nimmada village,

tdp leaders new reasons to yerram naidu death

yerram naidu.gif

Posted: 11/07/2012 12:32 PM IST
Tdp leaders new reasons to yerramnaidu death

dp leaders new reasons to yerramnaidu death

తెలుగు దేశం పార్టీ సినీయర్ నాయకుడు  మాజీ ఎంపీ  ఎర్రన్నాయుడు  మరణం పై  టీడీపీ శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  ఆయన మరణం వెనుక కుట్ర దాగి ఉందని వారు అంటున్నారు.  దీని పై  సమగ్ర విచారణ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.  వారు అనుమానం అంత   ఆ తారు ట్యాంకరు పైనే ఉందని వారు అంటున్నారు.  ఆయన వాహనాన్ని ఢీకొన్న తారు ట్యాంకరు.. ఘటనకు ఆరు గంటల ముందు నుంచీ అక్కడ ఉందని.. టీడీపీ శ్రేణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. తమ వాహనం రాకను గమనించే.. ఆ ట్యాంకరు డ్రైవర్ యూ టర్న్ తీసుకున్నాడని కొందరు తమ దృష్టికి తీసుకొచ్చినట్లు టీడీపీ జిల్లా అధ్యక్షుడు చౌదరి బాబ్జీ తెలిపారు. ఇందులో కచ్చితంగా కుట్రకోణం ఉందన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే.. పోలీసులు మాత్రం ఇది ప్రమాదమేనంటున్నారు. డ్రైవర్‌ను అరెస్టు చేసి, అతడి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని.. అందులో అనుమానించదగ్గ నెంబర్లేవీ లేవని స్పష్టం చేస్తున్నారు.

పోలీసుల కథనం ప్రకారం గాజువాకకు చెందిన బి.విజయరామరాజుకు చెందిన తారు ట్యాంకరు (ఏపీ 31 టీపీ 4668)కు తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం బట్రాజుపేట గ్రామానికి చెందిన శ్రీనివాస్‌కుమార్ కొన్నాళ్లుగా డ్రైవరుగా పనిచేస్తున్నాడు. ఒడిసాలో జరిగే రోడ్డు పనులకు విశాఖపట్నం నుంచి అతడు తారు తీసుకెళ్తున్నాడు. ఘటన జరిగిన రోజు రాత్రి తొమ్మిది గంటల సమయంలో క్లీనరు బి.దుర్గాప్రసాద్‌తో కలసి విశాఖలో తారు లోడుతో బయలుదేరాడు.  అయితేపోలీసుల కథనంతో టీడీపీ నేతలు ఏకీభవించట్లేదు. తారు ట్యాంకరు రాత్రి 8 గంటల నుంచే దన్నానపేట వద్ద హైవే అంచున నిలిపి ఉంచినట్టు.. ఘటన జరిగిన రెండు రోజుల అనంతరం తమకు స్పష్టమైన సమాచారం అందిందని చౌదరి బాబ్జి చెప్పారు. ఎన్ని పర్యాయాలు ఫోన్ చేసినా 108 వాహనం రాకపోవడం, గంట తర్వాత వచ్చినా అందులో ఆక్సిజన్ లేకపోవడం, హైవే అంబులెన్స్‌లో కూడా ఆక్సిజన్‌తోపాటు ప్రాథమిక వైద్య ఏర్పాట్లేవీ లేకపోవడం ఇవన్నీ తమ అనుమానాలను బలపరుస్తున్నాయని చెప్పారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Raghuveera reddy comments on chandrababu
Barack obama wins 2012 election  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles