Chiranjeevi press meet at delhi

Chiranjeevi Press Meet at Delhi, minister chiranjeevi, chiranjeevi mark in congress party, k chiranjeevi mark in cabinet, mp chiranjeevi, tourism minister chiranjeevi, Megastar power in congress party, mega mark in congress party, chiranjeevi very happy,

Chiranjeevi Press Meet at Delhi

Chiranjeevi.gif

Posted: 10/29/2012 11:43 AM IST
Chiranjeevi press meet at delhi

Chiranjeevi Press Meet at Delhi

చరిత్రలో ప్రజలు చెప్పుకొనే  గొప్ప విజయం సాధించాడు మంత్రి చిరంజీవి గారు.  అతి తక్కువ సమయంలో  జాతీయ పార్టీ లో తన మెగా మార్క్ చూపించుకున్నారు. అరుదైన ఆణిముత్యం ఎక్కడున్న ముత్యం తన మెగా పవర్ సత్తా చూపుతుంది. పార్టీ లో ఎప్పుడు వచ్చాం అన్నది ముఖ్యం కాదు.. మంత్రి పదవి వచ్చిందా లేదా అన్నదే ముఖ్యం  అనే మాటలను రుజువు చేసి చూపించారు  మెగా స్టార్ చిరంజీవి. తనకు మంత్రి పదవి లేటుగా వచ్చినా లేటెస్టుగా వచ్చిందని కాంగ్రెస్ నేత చిరంజీవి ఆనందం వ్యక్తంచేశారు. కేంద్ర పర్యాటక మంత్రిగా తన పనితనాన్ని నిరూపించుకొని.. తనదైన ముద్ర వేస్తానని తెలిపారు. కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి(స్వతంత్ర)గా రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణం చేసిన అనంతరం ఇక్కడి ఏపీ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ పెద్దలు నన్ను గుర్తించి నా మీద నమ్మకంతో ఈ హోదా కల్పించారు. దీనిని హోదా అనుకోకుండా ఒక బాధ్యతగా భావించి పని చేస్తాను. నాకు అవకాశం కల్పించినందుకు యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్, యువనేత రాహుల్‌గాంధీలకు ధన్యవాదాలు.

రాష్ట్ర పర్యవేక్షకులు గులాం నబీ ఆజాద్, వాయలార్ రవి, రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యానారాయణలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను’’ అని అన్నారు. తనకు పర్యాటక శాఖ కేటాయిస్తే సరైన న్యాయం చేస్తానన్నారు (అప్పటికీ ఆయనకు శాఖ కేటాయింపుపై సమాచారం అందలేదు). సువిశాల భారతదేశంలో అత్యద్భుత చారిత్రక ప్రదేశాలు, నదులు, మంచు పర్వతాలు, మందిరాలు తదితర ప్రపంచం గర్వించదగ్గ పర్యాటక ప్రదేశాలున్నాయని, వాటన్నిటినీ మరింతగా ప్రచారంలోకి తీసుకొస్తానన్నారు. విదేశీయులను మరింతగా ఆకర్షించి దేశ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. తన పదవిని ఉపయోగించుకొని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. సీనియర్లకు పార్టీ బాధ్యతలు అప్పజెప్పి, యువతకు మంత్రి పదవులివ్వడం.. పార్టీ బలోపేతానికి, 2014లో తిరిగి అధికారంలోకి రావడానికి దోహదం చేస్తుందని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Congress mla rajesh to join ysrc
Mp kavuri effect in congress party  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles