కాంగ్రెస్ పార్టీలో జరిగిన మెగా మార్పులతో కొత్త ముఖాలు మంత్రి వర్గంలో కనిపిస్తున్నాయి. అయితే కొంత మంది మీద సీనియర్ నాయకుడు అయిన కాంగ్రెస్ ఎంపీ కావూరి సాంబ శివరావు ఎఫెక్ట్ పడినట్లు తెలుస్తోంది.కాంగ్రెస్‌లో ఎప్పుడేం జరుగుతుందో ఊహించడం సాధ్యం కాదన్న విషయం జరిగిన కేంద్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకారంలో మరోసారి ధ్రువపడింది. మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణలో తనకు స్థానం లభిస్తుందని ఆశించి భంగపడిన ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు, శనివారం లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా ప్రకటించారు. కెఎస్ రావు రాజీనామా చేసే సమయానికి విశాఖ ఎంపీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి పురంధ్రీశ్వరి తనకు ప్రధాని మన్మోహన్ సింగ్ ఫోన్ చేసి వాణిజ్యం పరిశ్రమల శాఖకు మారుస్తున్నట్టు తెలియజేశారని మీడియాకు వెల్లడించారు. శాఖ మార్పును పదోన్నతిగా భావించి ఆమెకు కేబినెట్ హోదా లేదా స్వతంత్ర శాఖ దక్కవచ్చని అందరూ భావించారు. ఇదేక్రమంలో రక్షణ శాఖ సహాయ మంత్రిగా ఉన్న ఎంఎం పల్లంరాజు స్వతంత్ర హోదా కలిగిన మంత్రి అవుతున్నారన్న ప్రచారం జరిగింది. అయితే శనివారం నాటి అంచనాలు తెల్లారేసరికి రివర్స్ అయ్యాయి. కావూరి ఎఫెక్ట్‌తో సీన్ మొత్తం మారింది.
కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేయనున్న మంత్రుల జాబితాలో పల్లంరాజు పేరు నాల్గవ స్థానంలో ఉంటే, పురంధ్రేశ్వరి పేరు కనిపించ లేదు. ప్రమాణ స్వీకారం ముగిసిన తరువాత ప్రధాని సలహామేరకు రాష్టప్రతి కేటాయించిన శాఖల జాబితాలో పురంద్రేశ్వరి పేరు స్వతంత్య్ర హోదాలో వ్యవహరించే మంత్రుల జాబితాలోకాక ఎప్పటి మాదిరిగా సహాయ మంత్రుల జాబితాలోనే ఉంది. పురంద్రేశ్వరికి పదోన్నతి దక్కాల్సిన సమయంలో ఆమె సామాజిక వర్గానికే చెందిన ఏలూరు ఎంపీ కెఎస్ రావు తన విధేయత, సీనియారిటీని హైకమాండ్ గుర్తించలేదని మనస్థాపానికి గురయ్యారు. మంత్రి పదవి ఇవ్వనందుకు ఆగ్రహించి, పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయటంతో హైకమాండ్ పునరాలోచనలో పడింది. సొంతవారిని విస్మరించి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు ఇస్తారా? అంటూ కావూరి అన్యాపదేశంగా తెలుగుదేశం నుంచి ఫిరాయించిన రేణుకాచౌదరి, తెలుగుదేశం పార్టీతో సన్నిహిత సంబంధాలు ఉన్న పురంద్రేశ్వరిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఈ మార్పునకు దారి తీసి ఉండొచ్చని అంటున్నారు. పల్లంరాజుకు కేబినెట్ హోదా ఇవ్వటం, బంజారా కులానికి చెందిన బలారామ్ నాయక్, వెనుకబడిన తరగతులకు చెందిన కిల్లి కృపారాణి, మాదిగ సామాజిక వర్గానికి చెందిన సర్వే సత్యనారాయణ, రెడ్డి, కాపు సామాజిక వర్గాలకు చెందిన సూర్యప్రకాష్ రెడ్డి, చిరంజీవికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించటం ద్వారా తమకు దూరం అవుతున్న సామాజిక వర్గాలకు చేరువ కావటానికి కాంగ్రెస్ ప్రయత్నించిందని చెప్పక తప్పదు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more