టీటీడీ మాజీ చైర్మన్ డి.ఆదికేశవులునాయుడు ఇంట్లో పనిచేసి మానేసిన తన ముగ్గురు కుమారులను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని... ఆదికేశవులు నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన నసీమున్నీసా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించింది. ఈ మేరకు కమిషన్ చైర్మన్ జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూను కలిసి ఫిర్యాదు చేసింది. బెంగళూరు సదాశివనగర్‌లోని ఆదికేశవులు నివాసంలో తన కుమారులు అక్రం, జాఫర్, అరీఫ్‌లు గత నాలుగేళ్లుగా పనిమనుషులుగా పనిచేస్తున్నారని తెలిపింది. సరైన జీతభత్యాలు ఇవ్వకపోగా వెట్టిచాకిరీ చేయిస్తుండడంతో తన కుమారులు గత 20 రోజుల క్రితం పని మానేసి తమ గ్రామానికి వచ్చారని పేర్కొంది. ఈనెల 2న తమ ఇంటికి సమీపంలో ఉన్న వీరిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని వివరించింది. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని, సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేస్తుండగా ఆదికేశవులు మనుషులు చంపుతామంటూ బెదిరించారని వాపోయింది. తన కుమారులపై కర్ణాటకలోని కోలార్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో తప్పుడు కేసు పెట్టించారని, ఈనెల 16న కోలార్ నుంచి వచ్చిన పోలీసులు తన భర్త ఖాదర్‌వలీని కూడా దౌర్జన్యంగా తీసుకెళ్లారని నసీమున్నీసా కన్నీటి పర్యంతమైంది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి 48 గంటల్లో ప్రత్యక్షంగా నివేదిక సమర్పించాలని హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, డీఐజీ, చిత్తూరు ఎస్పీలను ఆదేశిస్తూ జస్టిస్ కక్రూ నోటీసులు జారీచేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more