Akai launches android based smart box for tvs

AKAI Launches Android Based Smart Box For TVs,Japanese Consumer Electronics brand, Akai, has launched the AKAI Smart Box, an internet enabled

AKAI Launches Android Based Smart Box For TVs

AKAI.gif

Posted: 10/05/2012 06:17 PM IST
Akai launches android based smart box for tvs

AKAI Launches Android Based Smart Box For TVs

ఇంటర్నెట్ సర్వీసులను పొందాలంటే ఇప్పటిదాకా కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్ ఉంటేనే సాధ్యమయ్యేది. ఇకపై ఈ రెండు లేకున్నా టీవీ ఉంటే చాలు ఇంటర్నెట్ సేవలను పొందవచ్చు. టీవీలో ఇంటర్నెట్‌ను సర్ఫ్ చేసేందుకు వీలు కల్పించే స్మార్ట్ బాక్స్‌ను జపాన్‌కు చెందిన కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం అకాయ్ దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర 6,590 రూపాయలు. ఈ బాక్స్‌కు దేశీయ మార్కెట్లో బాగా డిమాండ్ ఉండే అవకాశం ఉందని, వచ్చే మూడునాలుగేళ్ల కాలంలో లక్ష స్మార్ట్‌బాక్స్‌లను విక్రయించాలని కంపెనీ లక్ష్యం గా పెట్టుకుంది. ఇదే సమయంలో ఈ ఏడాది 250 కోట్ల రూ పాయల రాబడిపై అకాయ్ గురిపెట్టింది. ఈ స్మార్ట్ బాక్స్‌ను సాధారణ కలర్ టీవీలకే కాకుండా ఎల్‌సిడి, ఎల్ఇడి టీవీలకు కూడా బిగించుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఇది పని చేస్తుంది. 1.25 గిగా హెట్జ్ ప్రాసెసర్, వైర్‌లెస్ మౌస్, 4జి ఇంటర్నల్ మెమరీ (ఎస్‌డి కార్డుతో 32 జిబిలకు పెంచుకోవచ్చు), వైఫై, 3జి, నాలుగు యుఎస్‌బి పోర్ట్‌లు, హార్డ్ డ్రైవ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఒక విధంగా స్మార్ట్ బాక్స్ డిజిటల్ మీడియాగా వ్యవహరిస్తుంది. దీని ద్వారా వీడియో, గేమ్స్, వెబ్‌సైట్లలోని సమాచారాన్ని పొందవచ్చు. వైఫై లేదా బ్రాడ్‌బ్యాండ్, 3జి ద్వారా ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chandra babu fired on congress party
Obama vs rommy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles