Obama vs rommy

obama vs rommy, Barack Obama, Mitt Romney,Presidential candidates,

obama vs rommy

rommy.gif

Posted: 10/05/2012 06:15 PM IST
Obama vs rommy

obama vs rommy

మిట్ రోమ్నీ దూకుడు ముందు బరాక్ ఒబామా తేలిపోయారు... రిపబ్లికన్ వాగ్ధాటికి డెమోక్రాట్ డంగయ్యారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ప్రధాన ప్రత్యర్థుల నడుమ రాత్రి డెన్వర్ నగరంలో తొట్టతొలి ముఖాముఖి చర్చ సాగిన తీరిది. రోమ్నీ హుందాగా గంభీర స్వరంతో, ప్రవాహంలాంటి ప్రసంగంతో ఆకట్టుకున్నారు. కానీ, రెండోసారి అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ఒబామా తన సహజ ధోరణికి భిన్నంగా మాటలు తడుముకుంటూ, నేలచూపులు చూస్తూ బేలతనంతో జావగారిపోయారు. రోమ్నీ ప్రతి అంశంపైనా కచ్చితత్వంతో మాట్లాడి ఆకట్టుకున్నారని శరీర భాష నిపుణురాలు, 'యూ కాన్ట్ లై టు మి' (మీరు నాతో అబద్ధమాడలేరు) పుస్తక రచయిత్రి జేనిన్ డ్రైవర్ విశ్లేషించారు.  ఒబామా ఓ పక్కకు తలవంచి ఆత్మవిశ్వాసం లోపించిన రీతిలో నిల్చుంటే... రోమ్నీ తలను నిటారుగా ఉంచి, మధ్యవర్తి లేదా ప్రత్యర్థి వైపు స్థిర దృక్కులతో సాధికారికంగా మాట్లాడారని పేర్కొన్నారు. "మీరు విదేశీయులై ఉంటే... వారిద్దరి దేహ భాష ఆధారంగా చర్చను పరిశీలించి ఉంటే... ఎన్నికలకు ముందే రోమ్నీ అధ్యక్షుడై పోయినట్లేనని తప్పక విశ్వసిస్తారు'' అని ఆమె స్పష్టం చేశారు. ప్రధాన పోటీదారుల మధ్య ముమ్మారు చర్చల ప్రక్రియలో భాగం గా ప్రస్తుత 90 నిమిషాల తొలి భేటీపై చానెళ్లు మెరుపు పోలింగ్ నిర్వహించాయి. ఇందులో రోమ్నీకి 67 శాతం జనాభిప్రాయం అనుకూలంగా వస్తే- ఒబామా 25 శాతంతో వెనుకబడ్డారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Akai launches android based smart box for tvs
Vastunna meekosam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles