Telangana march tjac government

telangana, march, ap government, tjac, and political parties, september30th 2012

telangana-march-tjac-government

5.png

Posted: 09/26/2012 03:49 PM IST
Telangana march tjac government

        తెలంగాణ మార్చ్ ను నిర్వహించేందుకు టీజేఏసీ నేతలు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, ప్రభుత్వం మాత్రం మార్చ్ కు అనుమతి లేదని స్పష్టం చేసింది. మార్చ్ కు జిల్లాల నుంచి ప్రజలు నగరానికి వచ్చే దారులన్నీ పోలీసులు దిగ్బంధనం చేస్తారనే ఉద్దేశ్యంతోనే హైదరాబాద్ నుంచే భారీ సంఖ్యలో జన సమీకరణ చేయాలని జేఏసీ భావిస్తోంది.  సుమారు 2నుంచి 4లక్షల మంది వరకు ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు మీదుగా తీసుకురావాలనుకుంటున్నారు. అయితే ట్యాంక్ బండ్ ను ఎంచుకోవడం కూడా కొన్ని ఉద్దేశ్యాలున్నాయి. నగరానికి కేంద్ర స్థానంగా ఉండటం.. వినాయకులను నిమజ్జనం చేసేందుకు వచ్చే వారు తిరిగి వెళ్లకుండా అక్కడే ఉండే విధంగా జేఏసీ నేతలు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ప్రజలు భారీ సంఖ్యలో రోడ్డుపైకి వచ్చిన తర్వాత ఎన్ని రోజులు ఉండాల్సి వస్తోందో తెలియదు కాబట్టి ట్యాంక్ బండ్ అనువైన ప్రదేశంగా భావిస్తున్నారు. నగరంలోని ఎన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి రావాలనే దానిపై కూడా జేఏసీ నేతలు చర్చలు జరుపుతున్నారు.telangana       గతంలో జరిగిన పోరాటాల అనుభవాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇంకా అయిదు రోజుల సమయమే ఉన్నందున వీలైనంత వరకు ఒక రోజు ముందుగానే ఇరత ప్రాంతాల నుంచి వచ్చే వారిని ఇక్కడికి రప్పించాలని జేఏసీ నేతలు భావిస్తున్నారు. మరోవైపు టీజేఏసీ చైర్మన్ కోదండరాం, ఇతర నేతలు నగర పోలీస్ కమీషనర్ అనురాగ్  శర్మను కలిసి తెలంగాణ మార్చ్ కు అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే మార్చ్ కు అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని కమిషనర్ జేఏసీ నేతలకు చెప్పినట్లు సమాచారం.
    ప్రభుత్వం కూడా జేఏసీ నాయకుల చర్యలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. మార్చ్ ను వాయిదా వేసుకోవాలని ఇప్పటికే హోంమంత్రి కూడా జేఏసీ నేతలను కోరారు. బయోడైవర్సిటీ సదస్సు జరుగుతున్న రీత్యా ముందుస్తుగానే జేఏసీ నాయకులన్ని అరెస్ట్ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. జిల్లాల నుంచి జేఏసీ నేతలు ముందుగానే హైదరాబాద్ వచ్చి తలదాచుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు కొందరు తెలంగాణ మార్చ్ కు సంపూర్ణ మద్దతునిచ్చారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నాయకులెవ్వరూ తెలంగాణను అడ్డుకోవద్దని కేశవరావు కోరారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bilawal bhutto loves hina wants to marry her
Jagan bail cbi court  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles