Jagan bail cbi court

jagan, bail,petition, arguments, postpone

jagan-bail-cbi-court

11.gif

Posted: 09/26/2012 03:40 PM IST
Jagan bail cbi court

        jaganమరోవైపు, జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. ఇంతకుముందు పలుసార్లు వాయిదా పడ్డ ఈ కేసుపై నాంపల్లి సిబిఐ కోర్టు తాజాగా మరోమారు విచారణ జరిపింది. వాన్‌పిక్‌కు భూ కేటాయింపులకు సంబంధించి సిబిఐ దాఖలు చేసిన నాలుగవ ఛార్జిషీటుపై విచారణ జరిపిన సిబిఐ కోర్టు దీనిపై తదుపరి విచారణను అక్టోబర్‌ తొమ్మిదవ తేదీకి వాయిదా వేయడంతో పాటు జగన్‌ సహా మిగతా ముగ్గురు నిందితులకు రిమాండ్‌ పొడిగించింది. వాన్‌పిక్‌ కేసులో కోర్టు సమన్లు అందుకుని విచారణకు హాజరైన మంత్రి ధర్మాన ప్రసాదరావుకు సిబిఐ కోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
      కాగా, నాంపల్లి సిబిఐ కోర్టులో జరిగిన జగన్‌ ఆస్తుల కేసు విచారణ కోర్టు లోపల, బయట తీవ్ర ఉత్కంఠతకు దారి తీసింది. వాన్‌పిక్‌ భూ కేటాయింపులకు సంబంధించిన విచారణకు హాజరు కావాలని మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మాన ప్రసాదరావుతో పాటు ఇద్దరు ఐఎఎస్‌ అధికారులు మన్‌మోహన్‌ సింగ్‌, శామ్యూల్‌, జగతి పబ్లికేషన్స్‌ వైస్‌ ఛైర్మన్‌ విజయసాయి రెడ్డితో పాటు మరో 10 మంది వ్యక్తులు, సంస్థలకు సిబిఐ కోర్టు సమన్లు జారీ చేయడంతో వారంతా ఉదయం పదిన్నర గంటలకల్లా నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. చంచల్‌గూడ జైల్లో వున్న వై.ఎస్‌ జగన్‌, మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ, ఐఆర్‌ఎస్‌ అధికారి బ్రహ్మానందరెడ్డి, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌లను జైలు అధికారులు భారీ భద్రత మధ్య కోర్టుకు తరలించారు. ఇందులో జగన్‌ను బుల్లెట్‌ ప్రూఫ్‌ కారులో, పోలీసు ఎస్కార్ట్‌ మధ్య తరలించారు. ఉదయం 11 గంటలకు కేసు విచారణకు వచ్చింది. ధర్మాన తదితరులు మొదట కోర్టుకు హాజరుకాగా, జగన్‌, నిమ్మగడ్డ ప్రసాద్‌, మోపిదేవి వెంకటరమణ, బ్రహ్మానందరెడ్డి తర్వాత అక్కడకు వచ్చారు. అందరూ వచ్చిన విషయాన్ని నిర్ధారించుకున్న తరువాత ఈ కేసు విచారణను అక్టోబర్‌ తొమ్మిదవ తేదీకి మెజిస్ట్రేట్‌ వాయిదా వేశారు. దీని తరువాత నలుగురిని పోలీసులు భారీ భద్రత మధ్య చంచల్‌గూడ జైలుకు తరలించారు. అంతకుముందు కోర్టుకు హాజరయ్యే సమయంలో జగన్‌.. ధర్మాన ప్రసాదరావు, మోపిదేవిలతో కరచాలనం చేశారు. మోపిదేవి, ధర్మానలు ఒకరికొకరు ఎదురుపడ్డా పలకరించుకోలేదు. కరచాలనం కూడా చేయక పోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇదే కేసులో నిమ్మగడ్డ ప్రకాష్‌, విజయసాయిరెడ్డి, శామ్యూల్‌, మన్‌మోహన్‌ సింగ్‌ల విచారణ కూడా అక్టోబర్‌ తొమ్మిదవ తేదికి వాయిదా వేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telangana march tjac government
Sushma swaraj as pm candidate  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles