Bilawal bhutto loves hina wants to marry her

Bilawal Bhutto, Hina Rabbani Khar, Pakistan,love Story,

Bilawal Bhutto loves Hina, wants to marry her

Bilawal.gif

Posted: 09/26/2012 04:30 PM IST
Bilawal bhutto loves hina wants to marry her

Bilawal Bhutto loves Hina, wants to marry her

ఈ లవ్‌స్టోరీలో  విదేశాంగ మంత్రి. మినిస్టర్‌గా కంటే తన అందచందాలతోనే ఫేమస్‌ అయ్యిందీ గ్లామర్‌ డాల్‌. కళ్లు తిప్పుకోనీయని అందం ఆమె సొంతం. అప్సరసను తలపించే హీనా సొగసుకు.. యువరాజు ఫిదా అయ్యాడు. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు. అటునుంచి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో... వీరిద్దరు కొన్నేళ్లుగా తెగ ఎంజాయ్‌ చేస్తున్నారంటూ బంగ్లాదేశ్‌ టాబ్లాయిడ్‌‌ సెన్సేషనల్‌ ఆర్టికల్‌ ప్రచురించింది.

ప్రేమకు వయసుతో పనిలేదు, అలాగే పదవులతో సంబంధంలేదని నిరూపించారు. పోలిటికల్ లవర్స్ ‘ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ కాదు మేము ప్రేమించుకున్నాం అంటున్నారు ఆఇద్దరు. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఇదే మేటర్ తిరుగుతుంది.  ఆ ఇద్దరు  రబ్బానీ, బిలావల్. వీరి  మధ్య ప్రేమాయణం చాలా సిక్రెట్ గా సాగుతుంది.  హీనా గ్లామర్‌కు బిలావల్‌ ఫిదా అయ్యాడట. వీరి మద్య కుచ్... కుచ్  రొమాన్స్  కొన్ని ఏళ్లుగా సాగుతుందని అక్కడ మీడియాలో వార్తలు వస్తున్నాయి.  వీరి రొమాన్స్ అతని  అధ్యక్ష భవనంలోనే జరుతాయట.  అతని బర్త్‌ డేకు హీనా గ్రీటింగ్‌కార్డ్‌ పంపించినట్లు తెలుస్తోంది. అయితే ప్రేమకు ఒక విలన్  ఉన్నట్లే.. వీరి ప్రేమలో కూడా విలన్ మారిన అతని తండ్రి జర్థారీ . తన కొడుకు కెరీర్‌ పాడవుతుందని టెన్షన్‌తో విలన్ గా మారినట్లు తెలుస్తోంది. బిలావల్‌ కంటే 11ఏళ్లు పెద్దదైన హీనాకు పెళ్లై.. ఇద్దరు పిల్లలు ఉన్నారని మీడియా వార్తలు వస్తున్నాయి. అయితే  రబ్బానీ ఆంటీ ప్రేమలో మునిగిపోయిన యువరాజు త్వరలోనే  పెళ్లి చేసుకోవటానికి సిద్దమైనట్లు  తెలుస్తోంది.

Bilawal Bhutto loves Hina, wants to marry her

కానీ, ఈ పెళ్లితో బిలావల్ రాజకీయ భవిష్యత్తు నాశనమవుతుందని, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అనేక విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని జర్దారీ బెంగపెట్టుకున్నాట్లు తెలుస్తోంది. ప్రముఖ వ్యాపారవేత్త, కోటీశ్వరుడు అయిన తన భర్త ఫిరోజ్ గుల్జార్ నుంచి విడాకులు తీసుకోవాలని, కూతుళ్లను భర్త దగ్గరే వదిలేసి.. బిలావల్‌తో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని హీనా రబ్బానీ భావిస్తున్నట్టు మీడియా వార్తలు వస్తున్నాయి. అయితే  ఒకసారి వీరిద్దరూ పాకిస్తాన్ అధ్యక్ష భవనంలో మంచి రొమాన్స్ లో  ఉండగా జర్దారీకి దొరికిపోయారట. బిలావల్ పుట్టినరోజు సందర్భంగా రబ్బానీ ఒక గ్రీటింగ్ కార్డు పంపిందని.. అందులో మన బంధం శాశ్వతమైనదని, మనం త్వరలోనే మనకు మనంగా ఉంటామని అని ఆమె చేతి రాతతో రాసి ఉన్నట్లు తెలుస్తోంది.

తన కొడుకును భవిష్యత్‌ పాక్‌ అధ్యక్షుడిగా ఊహించుకుంటున్న జర్దారీకి.. వీరి ప్రేమాయణం పెద్ద తలనొప్పిగా మారింది. లవ్‌ ఎఫైర్‌తో.. కొడుకు పొలిటికల్‌ కెరీర్‌ స్పాయిల్‌ అవుతుందని... జర్దారీ టెన్షన్‌ పడుతున్నాడు.తండ్రి ఎంత అడ్డు చెబుతున్నా... ప్రేమమైకంలో పీకల్లోతు మునిగిపోయిన బిలావల్‌ మాత్రం.. త్వరలోనే రబ్బానీతో స్విస్‌ చెక్కేసి.. షాదీ చేసుకోవాలని ప్లాన్‌ చేస్తున్నాడట. అవసరమైతే పీపీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసైనా.. తన ప్రేమను పండించుకోవాలని తహతహలాడుతున్నాడు. హీనా కూడా... తన భర్తకు తళాక్‌ చెప్పి.. పిల్లలనూ అతని వద్దే వదిలేసి.. లవర్‌బాయ్‌ బిలావల్‌తో కలిసి.. స్విట్జర్లాండ్‌లో స్విస్‌ చాక్లెట్లు తింటూ... సెటిలైపోవాలని కలలు కంటోంది. పాక్‌లో హాట్‌ హాట్‌గా మారిన ఈ పొలిటికల్‌ లవ్‌ స్టోరీ ఏ ఎండ్‌ తీసుకుంటుందోనని ప్రేమికులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telangana march a grand success
Telangana march tjac government  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles