Father of the white revolution verghese kurien pass away

Verghese Kurien, milk revolution, White Revolution, National Dairy Development Board, Gujarat Co-Operative Milk Marketing Federation Ltd, Institute of Rural management, Loyola College, TISCO, Operation Flood, Padma Vibhushan

He made the ordinary, neighbourhood 'doodhwala' (milkman) a key player in the country's struggle for economic development and progress at the grassroot level. Verghese Kurien, the man who brought milk revolution in the country, died today in Gujarat. Verghese Kurien dies

Father of the White Revolution Verghese Kurien pass away.png

Posted: 09/10/2012 03:37 PM IST
Father of the white revolution verghese kurien pass away

Kurienభారతదేశంలో క్షీర విప్లవానికి నాంది పలికి, పాడి పరిశ్రమ సమగ్రాభివృద్ధికి దోహదం చేసిన పితామహుడు వర్గీస్ కురియన్ ఆదివారం  కన్నుమూశారు. 90 సంవత్సరాల కురియన్ దీర్ఘకాలంగా అస్వస్థతో బాధపడుతున్నారు. ఆనంద్ జిల్లా పొరుగున ఉన్న నాదియాద్‌లోని ముల్జ్భీయ్ పటేల్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. భారత దేశం పాడి పరిశ్రమలో ప్రపంచంలో అగ్రస్థానంలో నిలవడానికి ఈయన విశేష క్రుషి చేశారు. ఆయన 1921 నవంబర్ 26వ తేదీన కేరళలోని కోజికోడ్‌లో జన్మించారు. చెన్నైలోని లయోలా కాలేజీలో సైన్స్‌లో డిగ్రీ చదివారు. ఆ తర్వాత ప్రభుత్వ ఉపకారవేతనంతో డైరీ ఇంజనీరింగ్ చేశారు. బెంగళూర్‌లోని పశు సంవర్ధన, పాడి పారిశ్రమ సంస్థలో శిక్షణ తీసుకున్నారు.

మిషిగాన్ విశ్వవిద్యాలయంలో 1948లో మెకానికల్ ఇంజనీరింగులో మాస్టర్స్ డిగ్రీ చేశారు. డైరీ ఇంజనీరింగ్ ప్రత్యేకాంశంగా ఈ మాస్టర్స్ డిగ్రీ చేశారు.ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేసిన రాష్టప్రతి ప్రణబ్ ‘వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పాడిపరిశ్రమ అభివృద్ధికి విశేషంగా దోహదం చేసిన వ్యక్తి' అని కొనియాడారు. భారత సహకార ఉద్యమ పితామహులలో ఒకరుగా కురియన్‌ను ప్రధాని మన్మోహన్ సింగ్ అభివర్ణించారు. ఆయన సృష్టించిన క్షీర విప్లవం పాల ఉత్పత్తిలో భారత్‌ను నిరుపమాన దేశంగా మార్చిందని మన్మోహన్ అన్నారు. భారత ప్రభుత్వం ఆయనను పద్మ విభూషణ్‌తో గౌరవించింది. రామన్ మేఘసేసే అవార్డు కూడా ఆయనను వరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lagadapati rajagopal vs mp vivek
Parents suicide after daughter elopes  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh