Operation fail in hospital

operation fail in hospital, weight loss, Akruthi hospital, Ameerpet, Hydarabad, narenda kumar,

operation fail in hospital

operation.gif

Posted: 09/10/2012 12:35 PM IST
Operation fail in hospital

operation fail in hospital

అధిక బరువుతో బాధపడుతున్న వ్యక్తి.. శరీరాకృతిని సరిదిద్దుకోవడం కోసం వైద్యుల వద్దకు వెళ్లి వారి నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయాడు! రాష్ట్ర రాజధానిలో జరిగిన ఘోరమిది. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో నివాసం ఉంటున్న ఎస్.నరేంద్రకుమార్ (32) జేఎన్టీయూలో బయోటెక్నాలజీలో ఇటీవలే పీహెచ్‌డీ పూర్తిచేశారు. విదేశాల్లో ఉద్యోగావకాశం రావడంతో వీసా కోసం ప్రయత్నిస్తున్నారు. అక్కడికి వెళ్లేలోగా అధికబరువును తగ్గించుకుందామని అమీర్‌పేటలోని ఆకృతి ఆస్పత్రికి వెళ్లారు. ఈ నెల 3న.. ఆ ఆస్పత్రి వైద్యుడు నాగరాజును సంప్రదించారు.బరువు తగ్గడానికి శస్త్రచికిత్స ఒక్కటే మార్గమని ఆయన సూచించడంతో నరేంద్రకుమార్ అందుకు ఒప్పుకొన్నారు. డాక్టర్ నాగరాజు అదేరోజు ఆయనకు శస్త్రచికిత్స చేశారు. కానీ, ఆపరేషన్ సమయంలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల నరేంద్ర పెద్దపేగుకు రంధ్రం ఏర్పడింది. దీంతో పేగులోంచి మలం బయటపడి శరీరం లో అంతర్గతంగా వ్యాపించడంతో ఇన్ఫెక్షన్ వచ్చి కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తుల వంటి కీలకభాగాలు దెబ్బతిన్నాయి. నరేంద్ర పరిస్థితి విషమంగా మారడంతో ఆసుపత్రి వర్గాలు చికిత్స నిమిత్తం ఆయన్ను లోయర్ ట్యాంకు బండ్‌లోని ఓ ఆసుపత్రికి తరలించాయి. అయినా ప్రయోజనం లేకపోవడంతో కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని నరేంద్రకుమార్ కుటుంబ సభ్యులకు సూచించారు. వైద్య ఖర్చులు ఆకృతి నిర్వాహకులే భరించాలని వారు ఆందోళనకు దిగడంతో అతణ్ని సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న నరేంద్రకుమార్ మృతి చెందాడు. ఆకృతి నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడి పరిస్థితి విషమించిందంటూ నరేంద్రకుమార్ తండ్రి వెంకటేశ్వర్లు పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడు మృతి చెందడంతో 304ఎ కింద కేసు నమోదు చేశారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Parents suicide after daughter elopes
Y s vijayamma merger comments in pti interview  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles