Happy birthday megastar chiranjeevi

Happy Birthday megastar Chiranjeevi,57th Birthday of Megastar Chiranjeevi,chiranjeevi, delhi press meet, chiranjeevi cm post, chiranjeevi long gap in media, congress high command, chiranjeevi latest comment, pcc chief botsa already delhi, cm kiran seat change

Happy Birthday megastar Chiranjeevi

Chiranjeevi.gif

Posted: 08/23/2012 01:40 PM IST
Happy birthday megastar chiranjeevi

Happy Birthday megastar Chiranjeevi

రాజకీయంగా తనకు ఉన్నత పదవి ఎప్పుడు లభిస్తుందో ప్రజలు, సమయమే నిర్ణయించాలని రాజ్యసభ సభ్యుడు చిరంజీవి వ్యాఖ్యానించారు. సినిమారంగంలో ఉన్నత స్థాయిలో ఉంటే ప్రేక్షకులను అలరించేందుకు ఎలా వీలవుతుందో, రాజకీయ రంగంలోనూ ఉన్నత స్థానంలో ఉంటే అంతే ఎక్కువగా ప్రజలకు సేవచేసే అవకాశం ఉంటుందన్నారు. ‘‘ప్రాణం ఖరీదు సినిమా సమయంలో అత్యున్నత స్థానానికి చేరాలన్న లక్ష్యం ఉంది. ఆ స్థానంలో ఉంటే ఎక్కువమందిని అలరించే అవకాశం ఉంటుంది. రాజకీయ రంగంలోనూ బెటర్ స్థానం దొరికితే ఉన్నతమైన సేవలు అందించే అవకాశం ఉంటుంది. ఆ ఉన్నతమైన స్థానమెప్పుడో సమయమే చెబుతుంది. ఆ స్థానాన్ని ప్రజలే నిర్ణయిస్తారు’’ అని చిరంజీవి చెప్పారు. ఆయన ఏపీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ... తన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన అభిమానులు, ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఏడాది జనం మధ్యే పుట్టిన రోజు జరుపుకుంటానని, ఈ ఏడాది మాత్రం పార్లమెంట్ సమావేశాల కారణంగా వారికి దూరంగా జరుపుకోవాల్సి వచ్చిందని చెప్పారు.‘‘ఆర్టిస్ట్‌గా సినిమారంగంలో నంబర్‌వన్ స్థానంలో ఉండాలని ఉంటుంది. అభిమానులు సైతం అలా కోరుకోవచ్చు. నంబర్‌వన్ అవుతామా, లేదా అన్నది ప్రేక్షకులు, సమయం నిర్ణయిస్తుంది.

అదే విధంగా రాజకీయాల్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకొని ప్రజలకు చేరువవ్వాలి. మెరుగైన సేవలు అందించాలని కోరుకోవాలి. అంతేతప్ప ఓ లక్ష్యంతో ఉన్నత స్థానానికి చేరుకోవాలన్న తపనతో రాజకీయ ప్రస్థానం ఉండరాదు అన్నది నా అభిప్రాయం’’ అని చెప్పారు. ముఖ్యమంత్రి మార్పుపై చెప్పాల్సింది అధిష్టానమేనని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. కిరణ్‌కుమార్‌రెడ్డి బాగానే పనిచేస్తున్నారని, 2014 వరకు ఆయన ఉంటారనే భావిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మహావృక్షం వంటిదని, అది ఎప్పుడూ నిలిచి ఉంటుందని మరో ప్రశ్నకు బదులిచ్చారు.పటేల్‌ను కలిసిన కన్నా, చిరంజీవి: మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ చిరంజీవి రాత్రి పొద్దుపోయాక కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్ పటేల్‌తో భేటీ అయ్యారు. ధర్మాన రాజీనామా వ్యవహారంపై పటేల్ వారిద్దరి అభిప్రాయాలు తెలుసుకున్నట్టు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  700 illegal indians deported from uk to tackle visa abuse
Tdp leader errabelli dayakar rao  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles