Acharya bhadriraju krishnamurti passed away

Acharya Bhadriraju Krishnamurti passed away

Acharya Bhadriraju Krishnamurti passed away

Acharya Bhadriraju Krishnamurti passed away.png

Posted: 08/11/2012 01:10 PM IST
Acharya bhadriraju krishnamurti passed away

Bhadriraju-Krishnamurtiప్రముఖ భాషావేత్త, హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్ లర్ అయిన ఆచార్య భద్రిరాజు క్రిష్టమూర్తి (84) ఈ రోజు ఉదయం అనారోగ్యంతో చికిత్స పొందుతూ మెడిసిటీ ఆసుపత్రిలో మరణించారు. కృష్ణమూర్తి స్వస్థలం ప్రకాశం జిల్లా ఒంగోలు. ఈయన వైస్ ఛాన్స్ లర్ గానే కాకుండా ద్రావిడ భాష అధ్యయనానికి విశేషసేవలందించారు. ద్రావిడ భాష రంగానికి శాస్త్రీయతను కూర్చి స్థిరమైన పునాది ఏర్పరచిన వారిలో ముఖ్యులు. ద్రావిడ భాషాశాస్త్రవిజ్ఞానిగా ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు.

ఈయన 2003 లో రచించిన 'ద్రావిడియన్ లాంగ్వేజెస్' పుస్తకం గత రెండు శతాబ్దాల్లో ద్రావిడ భాషాధ్యనంలో సాధించిన అభివృద్ధిని సాధికారకంగా చర్చించి నేటి తరం ద్రావిడ భాషా శాస్త్రజ్ఞుల పాలిటి ప్రమాణ గ్రంథంగా నిలిచిందని చెప్పవచ్చు. తెలుగు భాష నవీకరణ గురించి ఎన్నెన్నో పరిశోధనా గ్రంధాలు, వ్యాసాలు ఆయన రచించారు. భద్రిరాజుకు కు భార్య, ఓ కుమార్తె , ముగ్గురు కుమారులు, ఉన్నారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలుపుతూ, ఈయన లోటు తీర్చలేదని అన్నారు. ఆయన మృతి పట్ల ఆంధ్ర విశేష్ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Potato juice can help cure stomach ulcers
Shivpal singh yadav tells up babus to steal a bit of public money  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles