Mars rover curiosity sends home first colour photo

Mars rover Curiosity sends home first colour photo,NASA, Mars, Mars rover, Curiosity rover, Mars rover descent video

Mars rover Curiosity sends home first colour photo

Mars.gif

Posted: 08/08/2012 03:01 PM IST
Mars rover curiosity sends home first colour photo

Mars rover Curiosity sends home first colour photo

 అంగారక గ్రహంపైకి అమెరికా అంతరిక్ష సంస్థ నాసా పంపిన క్యూరియాసిటీ శోధక నౌక మంగళవారం తొలిసారిగా ఓ కలర్ ఫొటోను, తక్కువ రిజల్యూషన్‌తో కూడిన వీడియోను పంపించింది. ఎనిమిది నెలల సుదీర్ఘ ప్రయాణం తర్వాత సోమవారం ఉదయం అరుణ గ్రహంపై వాలిన క్యూరియాసిటీ ఆ వెంటనే బ్లాక్ అండ్ వైట్ ఫొటోలను పంపిన సంగతి తెలిసిందే. అంగారకుడి వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత చివరి రెండున్నర నిమిషాల్లో అక్కడి నేలను తాకే వరకు జరిగిన కీలక ఘట్టాన్ని క్యూరియాసిటీ రోవర్ వీడియో రూపంలో పంపడం విశేషం. గేల్ క్రేటర్‌లోని చిన్నచిన్న రాళ్లు అధికంగా ఉన్న మైదానం ప్రాంతంలో దిగిన రోవర్ పంపిన అక్కడి ఫొటో, వీడియో అందంగా ఉన్నాయంటూ ఆ శోధక నౌక చీఫ్ సైంటిస్ట్ మైకేల్ మాలిన్ వ్యాఖ్యానించారు. పొగతో కూడినట్లున్న మార్స్ ఉపరితలంపై రోవర్‌కు దూరంగా ఉన్న ఓ పర్వతం తాజా ఫొటోలో కనిపిస్తోందన్నారు.

రోవర్ కు ఉత్తరం వైపున మైదానం, గేల్ క్రేటర్ చివరి అంచు కనిపిస్తున్నాయన్నారు. కాగా, రోవర్ యాంటెన్నా పూర్తిగా విచ్చుకున్న తర్వాత భూమిపై కంట్రోల్ రూంతో రోవర్ సంబంధాలు ప్రారంభం కానున్నాయి. అనంతరం వివిధ పరికరాల పనితీరు పరీక్షించుకున్న తర్వాత గేల్ క్రేటర్ ప్రాంతంలో కార్బన్, జీవం ఆనవాళ్లకు సంబంధించిన రసాయనాల అన్వేషణను రోవర్ త్వరలోనే చేపట్టనుంది. మార్స్‌పై రోవర్ దిగాక కార్యకలాపాలు జరిగిన తొలిరోజైన మంగళవారంను నాసా ‘సోల్ 1’గా పేర్కొంది. రోవర్ రోబో చేయి కెమెరాపై దుమ్ము పేరుకోవడం వల్ల ఛాయాచిత్రం పొగతో కూడినట్లు మసకగా వచ్చిందని తెలిపింది. అదేవిధంగా నాణ్యమైన చిత్రాలను, వీడియోలను క్యూరియాసిటీ ఇకపై వరుసగా పంపించనుందని నాసా పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Andhra girls rescued from delhi brothel house
Meet stevie wonder the blind piano playing cat who loves to entertain himself by tinkling the ebony and ivories  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles